Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎనర్జిటిక్ హీరో 'రామ్' సరసన నివేదా పేతురాజ్

ఎనర్జిటిక్ హీరో 'రామ్' సరసన నివేదా పేతురాజ్

వార్త 1 week ago

Ram Pothineni's new movie: టాలీవుడ్‌లో తనదైన నటన, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ సౌందర్యం నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) ఖాతాలో మరో క్రేజీ ఆఫర్ చేరినట్లు తెలుస్తోంది.

‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రలతో మెప్పించింది. తాజా ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తున్న రాబోయే కొత్త సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

Read Also :Shraddha Kapoor Eetha Movie: శ్రద్ధా కపూర్ 'ఈత' ఫస్ట్ లుక్ వైరల్

Ram Pothineni’s new movie: సక్సెస్‌ఫుల్ చిత్రాల నివేదా.. రామ్‌తో ఫస్ట్ టైమ్!

నివేదా పేతురాజ్ తెలుగులో స్టార్ హీరోల సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించి మెప్పించింది. ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. వీటితో పాటు ఓటీటీలో వచ్చిన ‘బ్లడీ మేరీ’, థియేటర్లలో అలరించిన ‘విరాట పర్వం’, ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాలలో నెగెటివ్, పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో జీవించింది. ఇటీవల ‘సింగ్ గీతం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు రామ్ పోతినేని సరసన నటిస్తే కెరీర్‌లో మరో పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ పోతినేని ఎనర్జీకి తగ్గట్టుగా ఈ చిత్రంలో నివేదా పాత్రను కూడా దర్శకుడు చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు టాక్. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మరియు చిత్ర యూనిట్ వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

సమంత 'మా ఇంటి బంగారం' పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. ఆ దంపతులకు ప్రత్యేక సత్కారం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha