Dailyhunt
ఎందుకంతటి 'యుద్ధం'!

ఎందుకంతటి 'యుద్ధం'!

వార్త 2 weeks ago

Donald Trump :తమ ఓటు ద్వారా రెండో సారి గద్దెనెక్కిన డొనాల్డ్ ట్రంప్ తమ అభీష్టాలకు వ్యతిరేకంగా, ఆకాంక్షలను పట్టించుకోకుండా నిర్వహిస్తున్న పాలనను ఇప్పుడు అమెరికన్లే వ్యతిరేకిస్తున్నారు.

అనేక దేశాల్లో జెన్ జి విప్లవాలు మొదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆలో చనలలో తేడా వచ్చింది. ప్రజాస్వామ్యయుతంగా గళ మెత్తుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన నికృష్ట పాలనతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసారన్నది అక్కడి విపక్షం నుంచే కాదు స్వపక్షం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. కొందరు కీలక సలహాదారులు సైతం ఆయన్ని విడిచి వెళ్ళారు. ఒక అడుగు ముందుకేసి ‘నో కింగ్స్’ పేరిట ఉద్యమిస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్ష లాది మంది జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇమిగ్రేషన్ వ్యతిరేక విధానాలను తప్పుబడుతూ ‘ప్లేకార్డు’లు ప్రదర్శన చేశారు. సెయింట్ పౌల్ నగరంలో కనీవినీ ఎరుగనంతగా భారీ ప్రదర్శన జరిగిం ది. దేశవ్యాప్తంగా 50రాష్ట్రాల్లో, మూడు వేలఐదు వందలకు పైగా నగరాల్లో, పట్టణాల్లో ట్రంప్కు వ్యతి రేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇజ్రాయిల్ కోసం ట్రంప్ఇరాన్పై దాడులకు పురికొల్పి చివరకు అమెరికా ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి తెచ్చిపెట్టారని ఆరోపిస్తున్నారు.

Read Also : Iran-America War: ఇరాన్-అమెరికా యుద్ధం: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెనక్కి తగ్గని ఇజ్రాయెల్!

 Donald Trump

Donald Trump : అనవసర యుద్ధవ్యయం

తమ దేశంకోసం కాక మిత్రదేశాల కోసం ట్రంప్ అనవసర యుద్ధవ్యయం(war expenditure)చేస్తున్నారని మండి పడుతున్నారు. ఇరాన్ పై యుద్ధానికి అమెరికన్లు ఎందుకు మూల్యం చెల్లించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి యుద్ధాల వల్ల సంపన్న దేశాలు మరింత సంపన్నంగా మారితే పేద దేశాలు మరీ పేద దేశాలుగా మారుతా యని అభిప్రాయాలున్నాయని పలువురు ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని మింగేసే వంటి ట్రంప్ విపరీత పోకడలకు తెరదింపాలని వారు కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి రావడం ఇదే ప్రథమం. ఈ ఆందోళన అమెరికాకే పరిమితం కాలేదు. దక్షిణ అమెరికా, యూరప్ దేశాల్లోనూ ప్రజలు పెద్దఎత్తున ‘నో కింగ్స్’ ర్యాలీల్లో పాల్గొని ఆమెరికా ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఒక పక్క తాను ఇప్పటికే 8 యుద్ధాలను ఆపానని, ప్రపంచానికే శాంతిదూత కావాలనుకున్నట్లు చెప్పుకునే ట్రంప్ దూకుడుకు ఇప్పటికే ఎన్నో దేశాలలో ప్రశాంత జీవనం కరువైంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలె త్తింది. సాధారణ జీవనానికి, ఆహార భద్రతకు సమస్య లు తలెత్తాయి. ఇవన్నీ ఇప్పుడు అమెరికన్లు కలత చెందే విషయాలు. వీటిని ట్రంప్ దృష్టికి తీసుకు వెళ్లాలనే పరోక్ష ఆశాభావం కూడా వారిలో ఉండచ్చు. అదే వారి నిరసనలకు కారణం.

ఆయన వ్యూహాలపై ఎవరికీ నమ్మకం లేదు

యుద్ధం మరింత కాలం కొనసాగించాలంటే భారీఎత్తున నిధులు కావాలని పెంటగాన్ ఇండెంట్ పెట్టింది. ఇవన్నీ అమెరికన్ల రక్షణ కోసమో, భద్రత కోసమో కాదని తేలిపోయింది. ఈ యుద్ధంతో తనకేమి పనిలేదని కూడా జనం నమ్ము తున్నారు. అందుకే వారు నడి వీధుల్లోకి వచ్చారు. ఒక పక్క నాటో కూటమి ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తోం ది. స్పెయిన్, శ్రీలంక వంటి దేశాలు సైతం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా అమె రికా, ఇజ్రాయిల్లు చేస్తున్న యుద్ధాలకు తమ దేశ గగన తలాలను వాడుకునేందుకు సైతం అంగీకరించడం లేదు. అమెరికా సాగించే యుద్ధానికి ఏకపక్ష యుద్ధంగా తేల్చేసింది. ఐక్యరాజ్యసమితి కూడా అమెరికా చేసే యుద్ధా నికి సానుకూలత వ్యక్తం చేయడం లేదు. ట్రంప్ తనంతట తానే శాంతి కాము కుడినని చెప్పుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. తమ దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరముంది. మొన్నామధ్య వెనిజువెలాపై దాడిలో దేశాధ్యక్షుడిని బంధించి ఆమెరికాకు తీసుకురాగలగడంతో ఆయన అహంకారానికి అడ్డు అదుపులేకుండా పోయింది. ప్రపంచ శాంతికి పెనుముప్పు తెచ్చినా ఆయనను ఏవర్గాలు అంగీకరించకపోయినా ఆయనలో మార్పు లేదు. ఆయన వ్యూహాలపై ఎవరికీ నమ్మకం లేదు. రోజురోజుకూ తన ను ఆయన దూకుడు భూతలదాడుల వరకు వెళ్లినట్లు చెప్పుకుంటున్నా. వైరి పక్షం బలిమి గురించి అంచనా లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. మరింత అభిశంసనకు గురికాకుండా ట్రంప్ తన సైనిక విన్యాసాలను
తగ్గించుకోవడంమంచిది.

 Donald Trump

పునరాలోచించుకోవాలి

ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ఖజానా కూడా తరిగిపో తోంది. అమెరికా ఇంతవరకు చేసినయుద్ధానికి దాదాపు 27.68 మిలియన్ డాలర్ల ఖర్చు (war expenditure)చేసినట్లు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చి ఇన్స్టి ట్యూట్ నివేదిక విడు దల చేసింది. ‘ఖర్గే ద్వీపాన్ని పేల్చేస్తాం, చమురు క్షేత్రా లతోపాటు విద్యుత్ వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేసేస్తా’మంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంస్ఇన్కు అల్టిమేటం జారీ చేసిన సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ఇరాన్ బెదరడం లేదు. అందుకే ట్రంప్ ఎంత వీలైతే అంత తొందరలో యుద్ధవిరమణ చేయడం మంచిదేమో! ట్రంప్ పెట్టే స్వల్పకాలపు గడువులన్నీ తన బెదరింపు లకు వైరి దేశాలు లొంగిపోతున్నట్లు ఊహించుకునే చేస్తున్నట్లు నౌకలరాకపోకల కోసం హర్మూజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ ఎన్నో మార్లు విజ్ఞప్తి చేసినా ఇరాన్ స్పందించలేదు. దానిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముగింపు కోరు కోవడం మంచిదే కానీ యుద్ధాన్ని ప్రారంభించిన వారే ముగింపు పలకాలనీ, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని ఇరాన్ ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో తన దేశంలో అంతర్గతంగా మరిన్ని నిరసనలు వ్యక్తం కాకుండా ట్రంప్ పునరాలోచించుకోవాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పాతాళానికి పడిపోయిన ట్రంప్ గ్రాఫ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha