Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్‌హెచ్-365బీబీ విస్తరణకు కేంద్రం ఆమోదం.. రూ. 705 కోట్లు మంజూరు!

ఎన్‌హెచ్-365బీబీ విస్తరణకు కేంద్రం ఆమోదం.. రూ. 705 కోట్లు మంజూరు!

వార్త 1 week ago

Buttayagudem Pattiseema Highway:బుట్టాయగూడెం - పట్టిసీమ - కొవ్వూరు జాతీయ రహదారి (NH-365BB) విస్తరణకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

44.70 కిలోమీటర్ల పరిధిలో 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల (2-Lane) రహదారిగా విస్తరించేందుకు రూ. 705 కోట్ల అంచనా వ్యయానికి స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి చొరవతో జాప్యానికి తెరపడి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.

Read Also:AP ration card holders: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

Buttayagudem Pattiseema Highway:బుట్టాయగూడెం – పట్టిసీమ – కొవ్వూరు మార్గంలో 44.70 కి.మీ. మేర రోడ్డు విస్తరణ

పోలవరం ప్రాజెక్టు సందర్శకులను, స్థానిక రాకపోకలను దృష్టిలో ఉంచుకుని పట్టిసీమ వద్ద 3.20 కి.మీ. మేర 4 వరుసల (4-Lane) బైపాస్ నిర్మాణంతో పాటు కన్నాపురం వద్ద మరో బైపాస్ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేయాలని అధికారులు సూచించారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు-దిగమర్రు మధ్య 40 కి.మీ. మేర రూ. 2,700 కోట్లతో 4 వరుసల రహదారి విస్తరణ డీపీఆర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. అయితే, అమలాపురం-రావులపాలెం (31.89 కి.మీ.) విస్తరణ ప్రాజెక్టు మంజూరై మూడేళ్లయినా డీపీఆర్ నిర్మాణంలో జాప్యం జరుగుతుండటంతో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Epaper: epaper.vaartha.com

ఏపీ ప్రజలకు విశాఖ ఏఐజీ గుడ్ న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha