TamilNadu Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ఎన్నికల సంఘం పరిపాలనాపరమైన ప్రక్షాళన చేపట్టింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IG) కె.ఏ.
సెంథిల్ వేలన్‌ను తక్షణమే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన స్థానంలో కొత్త ఐజీగా సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Key Responsibilities for IPS Avinash Kumar
కొత్త ఇంటెలిజెన్స్ ఐజీగా అవినాష్ కుమార్
ఎన్నికల సంఘం కార్యదర్శి మధుసూదన్ గుప్తా ఆదివారం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు. 2004 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అవినాష్ కుమార్‌ను కొత్త ఇంటెలిజెన్స్ ఐజీగా నియమిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 5:00 గంటలకల్లా ఆయన బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. కొత్త అధికారి విధుల్లో చేరిన వెంటనే ఆ మేరకు కంప్లయన్స్ నివేదికను పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది.
TamilNadu Elections: ఎన్నికల విధులకు దూరం
బదిలీ అయిన సెంథిల్ వేలన్‌పై ఎన్నికల సంఘం కఠిన నిబంధన విధించింది. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు ఆయనకు ఎలాంటి ఎన్నికల సంబంధిత విధులను కేటాయించకూడదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా సమాచారం అందించారు. ఎన్నికల సమయంలో పారదర్శకతను కాపాడేందుకే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

