NTR New Movie Update: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 అంటేనే నందమూరి ఫ్యాన్స్‌కు ఒక పెద్ద పండగ.
అయితే ఈసారి ఆ పండగను ఒకరోజు ముందే, అర్ధరాత్రే మొదలుపెట్టేందుకు సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'NTRNeel' ఫస్ట్ గ్లింప్స్ టీజర్ను ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Read Also: Jana Nayagan movie update: వచ్చే నెల విడుదల కానున్న 'జన నాయగన్'
NTR’s birthday treat.. First glimpse of ‘NTRNeel’ on May 19!
NTR New Movie Update: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కొత్త స్టిల్
NTR New Movie Update: ఈ మెగా ప్రాజెక్ట్ గ్లింప్స్‌ను కేవలం తెలుగు లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్‌ను టార్గెట్ చేస్తూ మేకర్స్ భారీ ప్లాన్ గీశారు. 5 భాషల్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఐదు భాషల్లో ఒకేసారి గ్లింప్స్ రానుండటంతో, నేషనల్ వైడ్‌గా ఈ సినిమా సృష్టించబోయే హైప్ మరో స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇటీవలే ఈ చిత్రం నుంచి మేకర్స్ వదిలిన ఒక క్రేజీ స్టిల్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఎడారి మధ్యలో ఒక వ్యక్తి చేతిలో కర్ర పట్టుకుని ఊరమాస్‌గా నిలబడి ఉన్న ఈ పోస్టర్, ప్రశాంత్ నీల్ సృష్టించబోయే కొత్త ప్రపంచం ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చింది. “The calm before the ________. Rest you know what to fill in the blank.” (________ముందు ప్రశాంతత… ఖాళీని మీరే పూరించండి) అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఈ స్టిల్‌ను పంచుకున్నారు. దీంతో ప్రశాంత్ నీల్ సృష్టించబోయే కొత్త ప్రపంచంపై అభిమానులు రకరకాల అంచనాలతో సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మే 19 అర్ధరాత్రి విడుదల కాబోయే ఫస్ట్ గ్లింప్స్, ఈ సినిమా స్థాయిని, కథా నేపథ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ఈ టీజర్ కోసం తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
లవ్ లెక్చర్స్ ఇస్తున్న మిల్కీ బ్యూటీ.. ఆ మాటల వెనుక ఆంతర్యమేంటి?

