Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

వార్త 6 months ago

NTR Prashanth Neel Movie Release Date: నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ 'ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్' సినిమా నుంచి ఎట్టకేలకు ఒక భారీ అప్‌డేట్ వచ్చేసింది.

ఈ సినిమా విడుదల తేదీని మంగళవారం స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో సందడి మొదలైంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలను ఈ ప్రకటన మరింత పెంచేసింది.

Read Also:Raja Shivaji Movie Trailer Launch: వేదికపై రితేష్, జెనీలియా కంటతడి: తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్

2027 జూన్ 11న గ్రాండ్ రిలీజ్

ఎన్టీఆర్ తన అధికారిక ట్విట్టర్ (X) ఖాతా ద్వారా సినిమా విడుదల తేదీని వెల్లడించారు. 2027 జూన్ 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ 'షాడో లుక్' ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ, ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లను గుర్తుచేస్తోంది.

NTR Prashanth Neel Movie Release Date: మే 20న స్పెషల్ సర్ప్రైజ్

రిలీజ్ డేట్‌తో పాటు అభిమానులకు మరో తీపి కబురును కూడా మేకర్స్ అందించారు. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20న ఈ సినిమాకు సంబంధించిన 'గ్లింప్స్' (Glimpse) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో ఎన్టీఆర్‌ను ఏ విధంగా చూపించబోతున్నారో తెలుసుకోవడానికి మే 20 వరకు వేచి చూడాల్సిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం తెలుగు సినిమా ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha