రెండోరోజు పరీక్షలకు 93 శాతం హాజరు
TG EAPCET 2026: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఈఏపి(ఎప్) సెట్-2026కి సంబంధించిన ఇంజనీరింగ్ పరీక్షలు నేటి(సోమవారం)తో ముగియనున్నాయి.
రెండో రోజు జరిగిన పరీక్షలకు 93 శాతం విద్యారునతలు హాజరైనట్టు ఎప్ సెట్-2026 కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Read Also: Education Week Celebrations : నేటి నుంచి తెలంగాణ లో విద్యావారోత్సవాలు
EAPCET Engineering Exams Conclude Today
TG EAPCET 2026: పరీక్షా నిర్వహణ, పర్యవేక్షణ
పరీక్షలను గంటల వరకు, మధ్యాహ్న సెషన్ను 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించారు. రెండో రోజు ఎప్ సెట్ ఇంజనీరింగ్ పరీక్షలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, జేఎన్టియు వీసీ ప్రొఫెసర్ కిషనన కుమార్ రెడ్డి, జేఎన్టియు రెక్టార్, ఎప్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్కుమార్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి క్యాదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, జేఎన్టియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు పరిశీ లించారు. ఇంజనీరింగన పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు.
హాజరు వివరాలు
రెండో రోజైన ఆదివారం ఉదయం సెషన్లో 35,092 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 32,673 మంది మధ్యాహ్న సెషన్లో 35,518 మందికిగానూ 33,225 మంది(93.54) శాతం మంది హాజరయ్యారు. చివరి రోజైన నేడు(సోమవారం) జరిగే సెషన్కి ఉదయం 35,230 మంది, మధ్యాహ్నం సెషన్కి 35,295 హాజరుకానున్నట్టు తెలిపారు. నేటితో ఇంజనీరింగ్ పరీక్షలు ముగియ నుండటంతో.. ఎప్్సట్-2026కి సంబంధించిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఫైనల్ కీతోపాటు ఫలితాలను వారం, 10 రోజుల్లో విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

