Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి వార్తలపై టీమ్ క్లారిటీ

ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి వార్తలపై టీమ్ క్లారిటీ

వార్త 15 hrs ago

Chiranjeevi AP Brand Ambassador Rumours: అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆయన వ్యక్తిగత బృందం తీవ్రంగా ఖండించింది.

ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పిన ‘టీమ్ మెగాస్టార్’, సామాజిక మాధ్యమాల్లో కొందరు సృష్టించిన ఈ అసత్య వార్తలను ఎవరూ నమ్మవద్దని కోరింది.

Read Also : Varun Tej Movie: 'బరి' మూవీ.. ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్, నాగబాబు

 Team clarifies reports about Chiranjeevi becoming AP brand ambassador.

Chiranjeevi AP Brand Ambassador Rumours: ప్రచారాన్ని నమ్మవద్దని చిరంజీవి టీమ్ విజ్ఞప్తి

గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిరంజీవికి ఉన్న ప్రజాదరణను ఉపయోగించుకోవాలని యోచిస్తోందని, అందులో భాగంగా ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తోందని వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. అయితే, ఈ వార్తలపై చిరంజీవి టీమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా స్పందిస్తూ పుకార్లకు చెక్ పెట్టింది. ఇలాంటి ధ్రువీకరించని అసత్య సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం గానీ, ప్రచారం చేయడం గానీ చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

వారణాసి' నుంచి మహేశ్ విజువల్స్ లీక్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha