Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి స్వయంగా వెళ్లిన గవర్నర్..
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ ఆకాంక్షించారు.
Governor Justice Abdul Nazeer called on AP Deputy CM Pawan Kalyan!
Deputy CM Pawan Kalyan: హైదరాబాద్ నివాసంలో భేటీ.. శస్త్రచికిత్స వివరాలు అడిగి తెలుసుకున్న గవర్నర్
ఇటీవలే ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స (Surgery) జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. సర్జరీ వివరాలను, ప్రస్తుతం తీసుకుంటున్న వైద్య చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.


