Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు వాయిదా

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు వాయిదా

వార్త 2 months ago

AP EAPCET Results Postponed: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఫలితాల విడుదల వాయిదా పడింది.

ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే ఈ రిజల్ట్స్ రావాల్సి ఉండగా.. తాజాగా ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 18వ తేదీ తర్వాతే ఎప్‌సెట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి.

 APEAPCET2026

Read also: CAIR Internship: DRDOలో 50 పెయిడ్ ఇంటర్న్ పోస్టులు.. జూన్ 4 లోపు అవకాశం

వాయిదాకు గల ప్రధాన కారణం ఇదే!

రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఎప్‌సెట్ ర్యాంకులను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్‌సెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. ఒకవేళ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలకు ముందే ఎప్‌సెట్ ర్యాంకులు ఇస్తే ఆ తర్వాత మార్కులు పెరిగిన విద్యార్థుల ర్యాంకుల్లో మార్పులు వస్తాయి. దీనివల్ల విద్యార్థులు నష్టపోవడమే కాకుండా గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

AP EAPCET Results Postponed: వేగంగా ఇంటర్ మూల్యాంకన ప్రక్రియ

ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కేవలం మ్యాథ్స్ సబ్జెక్టు కోసమే లక్ష మందికి పైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. జూన్ 5తో ఈ పరీక్షలు ముగియనున్నాయి.

ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలు ముగిసిన వెంటనే దాదాపు 13 రోజుల పాటు సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని (Correction) అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డును ఆదేశించారు. జూన్ 18 నాటికి ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసి, ఆ వెంటనే ఏపీ ఎప్‌సెట్ ర్యాంకులను ప్రకటించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

DRDOలో 50 పెయిడ్ ఇంటర్న్ పోస్టులు.. జూన్ 4 లోపు అవకాశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha