Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ రైలు..టికెట్ ధరలు ఇవే!

ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ రైలు..టికెట్ ధరలు ఇవే!

వార్త 2 weeks ago

AP Vande Bharat: ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఏపీ మీదుగా త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టనుంది. బెంగళూరు-ముంబై మధ్య ఈ సర్వీసును ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది.

ఈ రైలుకు సంబంధించి ప్రతిపాదిత షెడ్యూల్, స్టాపులు, టికెట్ ధరల వివరాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. అయితే అధికారిక టైమ్‌టేబుల్‌ను రైల్వేశాఖ ఇంకా ప్రకటించాల్సి ఉంది. బెంగళూరు-ముంబై మధ్య ప్రస్తుతం రైలు ప్రయాణానికి సుమారు 22 నుంచి 24 గంటల వరకు సమయం పడుతోంది. వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ముంబై-బెంగళూరు మధ్య దాదాపు 15 గంటల 45 నిమిషాల్లో ప్రయాణం పూర్తయ్యే అవకాశం ఉంది.

Read Also :Vijayawada Durgamma: దసరా ఆర్జిత సేవల టికెట్లు విడుదల.. బుక్ చేసుకోండిలా?

ఏపీలో రెండు స్టాపులు

ఈ వందే భారత్ స్లీపర్ రైలు ఏపీలోని అనంతపురం, గుంతకల్ రైల్వే స్టేషన్లలో ఆగనున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాంతాల ప్రయాణికులకు ముంబై, బెంగళూరుకు రాత్రి ప్రయాణంతో పాటు సౌకర్యవంతమైన స్లీపర్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి రాత్రి 7.50 గంటలకు రైలు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు బెంగళూరుకు చేరుకునేలా షెడ్యూల్‌ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

16 కోచ్‌లతో వందే భారత్ స్లీపర్

ఈ సర్వీసు కోసం 16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైలు సెట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML), ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) కలిసి ఈ రైలు కోచ్‌లను తయారు చేశాయి. మొత్తం 16 కోచ్‌లలో 11 కోచ్‌లు థర్డ్ ఏసీ, 4 కోచ్‌లు సెకండ్ ఏసీ కేటగిరీలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

AP Vande Bharat: టికెట్ ధర ఎంతంటే?

ప్రతిపాదిత వివరాల ప్రకారం థర్డ్ ఏసీ టికెట్ ధర సుమారు రూ.3,000 వరకు ఉండొచ్చని సమాచారం. టికెట్ ధరలోనే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం కూడా అందించే అవకాశం ఉంది. అయితే తుది ఛార్జీలను రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బెంగళూరు-ముంబై మధ్య సుమారు 1,137 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలో డబుల్ ట్రాక్, విద్యుదీకరణ పూర్తయి ఉండటంతో పాటు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపే సామర్థ్యం ఉంది. దీంతో వందే భారత్ స్లీపర్ సర్వీసుకు ఈ మార్గాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

విశాఖలో నేడు, రేపు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha