AP Schools Sick Rooms:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం రక్షించడానికి ప్రభుత్వం సిక్ రూమ్‌లు ఏర్పాటు చేస్తోంది. పాఠశాలల్లో అత్యవసర సమయంలో వైద్య సహాయం అందించడానికి ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్‌లు అనే అంశంపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.
విద్యార్థులు పాఠశాల సమయాల్లో అకస్మాత్తుగా అనారోగ్యం పాలైనా గాయపడినా వెంటనే ప్రథమ చికిత్స అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 629 పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ సదుపాయం కల్పిస్తున్నారు. ఒక్కో పాఠశాలకు ఐదు లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించి మొత్తం ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తరగతి గదిలో ఒక ప్రత్యేక గదిని కేటాయించి బెడ్, ప్రాథమిక మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు సిద్ధంగా ఉంచుతున్నారు. స్థానిక ఏఎన్‌ఎం సేవలను ఈ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సిలింగ్ ఇస్తూ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేస్తున్నారు.
Read also: AP ration cards cancelled: ఏపీలో ముప్ఫై ఒక లక్షల రేషన్ కార్డులు రద్దు
Sick rooms in AP government schools
ముస్తాబు కార్యక్రమంతో విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత
పాఠశాల విద్యార్థులకు చిన్న వయసు నుంచే మంచి అలవాట్లు నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమం అమలు చేస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే జూనియర్ కాలేజీలలో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేశారు. పరిశుభ్రతను ఒక జీవనశైలిగా మార్చుకోవడానికి ప్రతి తరగతి గదిలో అలాగే హాస్టల్ గదిలో ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. గోడకు అద్దం తగిలించి దువ్వెన, టవల్, సబ్బు, నెయిల్ కట్టర్, హ్యాండ్ వాష్, నీళ్ల బకెట్ అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థులు అక్కడకు వచ్చి చక్కగా తయారై శుభ్రంగా ఉండటానికి ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది. పాఠశాల స్థాయిలో పరిశుభ్రత పట్ల శ్రద్ధ పెంచడానికి ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి స్థానిక ఆసుపత్రి సిబ్బంది సహకారంతో వైద్య పరీక్షలు జరుపుతున్నారు. పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థులలో ఉత్సాహం నింపుతుంది.
AP Schools Sick Rooms:ఏపీ పాఠశాలల్లో ఆరోగ్య రక్షణకు సరికొత్త ప్రణాళిక
పాఠశాల విద్యార్థుల సంక్షేమం కోసము ఏపీ విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం తల్లిదండ్రులలో హర్షం కలిగిస్తోంది. నెల రోజుల్లో ఈ సిక్ రూమ్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థుల శారీరక ఆరోగ్యం కాపాడుతూనే మానసిక ఒత్తిడి దూరం చేయడానికి నిపుణుల సేవలు వినియోగిస్తున్నారు. ప్రతి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి ప్రత్యేక రికార్డులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చూస్తున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా బయటకు పరుగులు తీయకుండా పాఠశాలలొనే తక్షణ చికిత్స అందేలా చేయడం విశేషం. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు అన్నీ విజయవంతంగా అమలు జరుగుతున్నాయి. విద్యార్థి భవిష్యత్తు బంగారుమయం కావడానికి విద్యతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అని ప్రభుత్వం నిరూపిస్తోంది.
Epaper: epaper.vaartha.com

