Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ సచివాలయ సిబ్బంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు

ఏపీ సచివాలయ సిబ్బంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు

వార్త 2 months ago

AP Sachivalayam Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సచివాలయ ఉద్యోగులకు త్వరలోనే నోషనల్ ఇంక్రిమెంట్ అమలు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ, సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ సిబ్బందికి ఎలాంటి ప్రమోషన్లు, కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేశారని, ఆ లోపాలన్నింటినీ తమ ప్రభుత్వం సరిదిద్దుతోందని ఆయన పేర్కొన్నారు.

Read also: Turaka Kishore: ఇళ్ల పట్టాల పేరిట భారీ మోసం.. వైసీపీ నేత తురకా కిషోర్‌పై కేసు నమోదు

రంగంలోకి మంత్రివర్గ ఉపసంఘం.. ఇప్పటికే 7,246 మందికి పదోన్నతులు!

సచివాలయ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. వారి పదోన్నతుల (Promotions) ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇప్పటికే ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని (Cabinet Sub-Committee) ఏర్పాటు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఉద్యోగికి ఖచ్చితంగా ప్రమోషన్ ఛానల్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే విభిన్న ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 7,246 మంది సచివాలయ సిబ్బందికి ఇప్పటికే విజయవంతంగా పదోన్నతులు కల్పించినట్లు మంత్రి బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.

AP Sachivalayam Employees: ప్రతి ఉద్యోగికి లబ్ధి.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు

గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. పదోన్నతులతో పాటు నోషనల్ ఇంక్రిమెంట్‌ను కూడా పక్కాగా అమలు చేసి తీరుతామని సచివాలయ అసోసియేషన్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ అత్యంత కీలకమైనదని, ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

తాడిపత్రిలో బీడీ కార్మికులకు ఇంటి పట్టాల పంపిణీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha