Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ సముద్ర తీరంలో ఘోర ప్రమాదం.. బోటులో 4 మృతదేహాలు లభ్యం!

ఏపీ సముద్ర తీరంలో ఘోర ప్రమాదం.. బోటులో 4 మృతదేహాలు లభ్యం!

వార్త 2 weeks ago

Kothapatnam Boat Accident: ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం సముద్ర తీరంలో విషాదకర ఘటన వెలుగుచూసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సముద్రపు అలల ధాటికి కొట్టుకొచ్చిన ఈ పడవలో నాలుగు మృతదేహాలు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. కొత్తపట్నం తీరానికి చేరుకున్న బోటును స్థానిక మత్స్యకారులు గుర్తించారు. అందులో నాలుగు మృతదేహాలు ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు, మెరైన్ అధికారులకు సమాచారం అందించారు. సముద్రంలో అలల ఉధృతి కారణంగా బోటు అదుపుతప్పి బోల్తా పడి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Read Also :Khammam Floods: తెలంగాణలో తుఫాన్ బీభత్సం.. 11 మంది SDRF సిబ్బంది గల్లంతు!

15 మందికి పైగా మత్స్యకారులు గల్లంతైనట్లు అనుమానం

సదరు బోటులో మొత్తం 15 మందికి పైగా మత్స్యకారులు ఉన్నట్లు భావిస్తున్నారు. పడవలో నలుగురి మృతదేహాలు మాత్రమే లభించడంతో మిగిలినవారు సముద్రంలో గల్లంతై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గాలింపు చర్యలు ముమ్మరం చేసిన మెరైన్ పోలీసులు

సమాచారం అందుకున్న కొత్తపట్నం పోలీసులు, మెరైన్ అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బోటును పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. మృతుల వివరాలు, వారి స్వస్థలాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వీరు తమిళనాడుకు చెందిన మత్స్యకారులా? లేక స్థానిక తీరప్రాంత గ్రామాల వారా? అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. మరోవైపు గల్లంతైన వారి ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ బృందాలు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టాయి. నౌకలు, స్థానిక మత్స్యకారుల పడవల సహాయంతో అన్వేషణ కొనసాగిస్తున్నారు.

Kothapatnam Boat Accident: ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు

బోటు సముద్రంలో అలల ఉధృతికి అదుపుతప్పిందా? లేదా ఏదైనా భారీ నౌక ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది విచారణ పూర్తయిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గౌహతి హోటల్ కాల్పుల ఘటనలో నిందితుడు ఎన్‌కౌంటర్‌లో మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha