Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ సినీ రంగానికి కొత్త కళ.. చైర్మన్‌గా భరత్ భూషణ్!

ఏపీ సినీ రంగానికి కొత్త కళ.. చైర్మన్‌గా భరత్ భూషణ్!

వార్త 3 months ago

14 మంది డైరెక్టర్లు నియామకం

AP FTVTDC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిల్మ్ టివి థియేటర్ అభివృద్ధి సంస్థ (ఎపిఎఫివిటిడిసి) చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చైర్మన్ గా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పి.భరత్ భూషణ్ పేరుకే మొగ్గు చూపించింది. వైస్ చైర్మన్ గా దర్శకుడు మెహర్ రమేష్ను ఎంపిక చేసింది. 14 మంది డైరెక్టర్లను నియమించింది. సినీ రచయిత, తెనాలి కళల కాణాచి పరిషత్ నిర్వాహకులు బుర్రా సాయిమాధవ్, చిలకలూరిపేటకు చెందిన రిటైర్డ్ అధ్యాపకులు, రచయిత డా. కందిమళ్ల సాంబశివరావులను డైరెక్టర్లుగా నియమించారు..

Read also: AP Anganwadi : అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

 Appointment of the New Governing Body of AP FTVTDC

AP FTVTDC: కీలక బాధ్యతల్లో సినీ ప్రముఖులు

హీరో సుమన్ తల్వార్, హీరో శివాజీ, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, కూచిభోట్ల వివేకానంద, నటి ఝాన్సీ, సీనియర్ జర్నలిస్ట్ కె.ఉమామహేశ్వర రావు, దర్శకుడు వి. సముద్ర, మీర్ ఎస్., ఎ. సత్యనారాయణ, ఎస్.వెంకట కృష్ణారెడ్డి, జి.రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణలను డైరెక్టర్లుగా నియమించారు. ఇక టివి, సినిమా నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో సినిమా, టివి షూటింగులు జరిగేందుకు, సినీ, టివి, రంగస్థల కళాకారుల అభివృద్ధికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చిత్తశుద్ధితో కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

విజయవాడలో అర్థరాత్రి హైడ్రామా: కార్లతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ యువకుల వీరంగం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha