Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ స్పెషల్‌ టెట్‌ ఫలితాలు రద్దు?

ఏపీ స్పెషల్‌ టెట్‌ ఫలితాలు రద్దు?

వార్త 0 months ago

Special TET Results:ఏపీలో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన స్పెషల్‌ టెట్‌ ఫలితాలు విడుదలపై తీవ్రమైన సందిగ్ధం నెలకొంది. ఈ పరీక్షలకు హాజరైన 80,907 మంది ఉపాధ్యాయుల్లో ప్రస్తుతం తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది.

అక్టోబర్ 11 నుంచి 15 వరకు మొత్తం 74 కేంద్రాల్లో అధికారులు ఈ పరీక్షలు పూర్తి చేశారు. దరఖాస్తు చేసుకున్న 83,015 మందిలో దాదాపు 97.46 శాతం మంది ఉపాధ్యాయులు పరీక్ష రాశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 24న రెస్పాన్స్‌ షీట్లు అలాగే ప్రాథమిక కీ రావలసి ఉంది. కానీ విద్యాశాఖ నుండి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో టీచర్లలో సందిగ్ధం పెరిగిపోయింది.

CLAT 2027: దరఖాస్తుకు అక్టోబర్ 31 ఆఖరు తేదీ!

 Uncertainty surrounds the special TET results

ప్రశ్నావళి లీక్ వార్తలు.. కోర్టులో పిటిషన్లు

ఎన్‌ఈపీ 2020 నిబంధనల ప్రకారం 2028 ఆగస్టు నాటికి టీచర్లు టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు చెప్పింది. దాంతో విద్యాశాఖ అధికారులు ఏపీ టెట్ ఆగస్టు 2026 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కోసం ఒక్కో పేపర్‌కు 700 చొప్పున ప్రశ్నలు ముందుగానే వెబ్‌సైట్‌లో పెట్టారు. అవే ప్రశ్నలు వరుసగా పరీక్షలో రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరోవైపు టెట్ రద్దు చేయాలని కొందరు ఉపాధ్యాయులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం కలకలం రేపింది. ప్రభుత్వం కూడా టెట్ రద్దుకు హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు మరింత అయోమయంలో పడ్డారు.

Special TET Results:మూల్యాంకనం పూర్తి ఫలితాల ప్రకటనలో ఆలస్యం

నిజానికి విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ కంటే 6 రోజుల ముందే ఈ పరీక్షలు పూర్తయ్యాయి. ఆ లెక్కన ఈనెల 19 నాటికే రెస్పాన్స్ షీట్లు ఇచ్చి నెలాఖరుకు ఫలితాలు ఇవ్వాలి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినా కూడా అధికారులు ఫలితాలను పక్కన పెట్టేశారు. కేవలం క్వాలిఫై లేదా నాట్ క్వాలిఫై మాత్రమే ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. దీనివల్ల పరీక్ష రాసిన వేలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.

Epaper: epaper.vaartha.com

జనవరి 20 నుంచే జేఈఈ పరీక్షలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha