AP Schools Holiday: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు కీలక అప్డేట్. రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలతో పాటు మురసు తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు, భారీ వర్షాల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలల సెలవుల వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
Nara Lokesh: రాప్తాడు బాలికకు విజయవంతంగా ఆపరేషన్.. మంత్రి లోకేశ్ కీలక ప్రకటన!
నవంబర్ 5న ఎన్నికల కారణంగా సెలవు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని అనేక ప్రభుత్వ పాఠశాలలను ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది నవంబర్ 4 నుంచే ఆయా పాఠశాలలను స్వాధీనం చేసుకుని పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో నవంబర్ 5న పోలింగ్ జరిగే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించారు. అయితే మున్సిపాలిటీలు, పట్టణ పరిధిలోని పాఠశాలలు మాత్రం సాధారణంగానే పనిచేయనున్నట్లు సమాచారం. కాబట్టి విద్యార్థులు తమ పాఠశాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అనేది తెలుసుకోవాలి.

AP Schools Holiday: ఉపాధ్యాయులకు నవంబర్ 6న OD
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు అధికారులు మరో కీలక వెసులుబాటు కల్పించారు. ఎన్నికల విధులు నిర్వహించిన టీచర్లకు నవంబర్ 6న ఆన్ డ్యూటీ (OD) సౌకర్యం కల్పించినట్లు సమాచారం. ఎన్నికల విధుల నిర్వహణ తర్వాత ఉపాధ్యాయులకు ఈ వెసులుబాటు ఉపయోగపడనుంది.

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2,721 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల!

