Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీకి కొత్తగా మరో రెండు కాఫీ దిగ్గజ కంపెనీల రాక!

ఏపీకి కొత్తగా మరో రెండు కాఫీ దిగ్గజ కంపెనీల రాక!

వార్త 1 week ago

Araku Coffee Production: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాఫీ సాగు, ప్రాసెసింగ్ మరియు ఎగుమతుల రంగం శీఘ్రగతిన పురోగమిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా, ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న కాంటినెంటల్, ఇండస్ వంటి ప్రముఖ సంస్థల సరసన చేరేందుకు మరో రెండు దిగ్గజ కంపెనీలు ప్రభుత్వంతో త్వరలోనే అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోనున్నాయి.

Read Also: Veligonda Project First Phase : వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు

 Araku Coffee Production

Araku Coffee Production : ఎగుమతుల పరంగా మరింత పెద్ద ఎత్తున ఊతం

పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, ప్రధాన నగరాల్లో కేఫ్‌ల ఏర్పాటుకు ఇస్తున్న సబ్సిడీలు ఇందుకు ఎంతగానో దోహదపడుతున్నాయి. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 2.45 లక్షల ఎకరాల్లో సుమారు 1.50 లక్షల మంది గిరిజన రైతులు సహజసిద్ధ సేంద్రియ పద్ధతిలో సువాసనభరిత అరబికా కాఫీని సాగు చేస్తున్నారు. ఏపీలో ఏటా 15,000 టన్నుల కాఫీ గింజల ఉత్పత్తి, 23,000 టన్నుల కాఫీ పొడి తయారీ జరుగుతోంది. మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్త కంపెనీల రాకతో ఏపీ కాఫీ రంగానికి ప్రాసెసింగ్, ఎగుమతుల పరంగా మరింత పెద్ద ఎత్తున ఊతం లభించనుంది. రాష్ట్రంలో ఏటా 23 వేల టన్నుల కాఫీ పొడి తయారు చేస్తున్నారు. అందులో ఫ్రీజ్‌ డ్రైడ్‌ ఇన్‌స్టెంట్‌ కాఫీ ఉత్పత్తి అధికంగా ఉంటోంది.

30 ఏళ్ల నిరీక్షణకు తెర.. నేడు వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha