Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో 20 శాఖలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల

ఏపీలో 20 శాఖలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల

వార్త 1 month ago

APPSC Notification 2026 : ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ (APPSC) భారీగా ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది.

మొత్తం 20 వేర్వేరు శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వీటి ద్వారా మొత్తం 892 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం ఇటీవల వయోపరిమితిని సడలించిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లు వెలువడటం నిరుద్యోగ యువతకు పెద్ద ఊరటనిచ్చింది. అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.

 ap job calendar 10060 jobs released

గ్రూప్-1 సహా పలు కీలక పోస్టులు: పూర్తి వివరాలు అధికారిక సైట్‌లో

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన గ్రూప్-1 కేటగిరీలో 163 ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) వంటి పలు కీలక ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారు. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, సిలబస్ మరియు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.

ఏఎన్‌ఎం అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha