Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఏపీలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

వార్త 3 weeks ago

AP Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో వాతావరణం వేగంగా మారిపోయింది. దీని ప్రభావంతో రానున్న మరో రెండు రోజుల పాటు తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి మూర్తి వెల్లడించారు.

ఈ అల్పపీడన ప్రభావం వల్ల కోస్తాంధ్ర అంతటా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఆయన పేర్కొన్నారు.

Read Also: AP students RTC bus pass free: గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఉచితం

 Low-pressure area in AP… Heavy rains in these districts for two days!

AP Weather Update: ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ముఖ్యంగా ఉత్తర కోస్తా, ఏజెన్సీ ప్రాంతాలపై ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండనుంది. క్రింది జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు:

  • శ్రీకాకుళం
  • విజయనగరం
  • పార్వతీపురం మన్యం
  • అల్లూరి సీతారామరాజు జిల్లా
  • ఏలూరు

పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు.. వేటకు వెళ్లొద్దని సూచన

సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని ప్రధాన నౌకాశ్రయాలలో (పోర్టుల్లో) అధికారులు ముందస్తు జాగ్రత్తగా 3వ నెంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా రాబోయే రెండు రోజుల వరకు సముద్రంలో వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారి మూర్తి గట్టిగా సూచించారు. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Epaper: epaper.vaartha.com

పాపికొండల విహార యాత్ర పునఃప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha