Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో దారుణం.. మహిళను చంపి డబ్బాలో కుక్కి న ఘటన

ఏపీలో దారుణం.. మహిళను చంపి డబ్బాలో కుక్కి న ఘటన

వార్త 3 weeks ago

AP : ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో రెండు నెలల కిందట జరిగిన ఒక దిగ్భ్రాంతికర హత్యోదంతం తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, ఆదిలక్ష్మి (32) అనే మహిళకు అధిక వడ్డీ ఆశ చూపి మరో మహిళ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసింది.

నిందితురాలి మాటలు నమ్మిన ఆదిలక్ష్మి తన సొంత బంగారు నగలను అమ్మేసి, మరికొంత సొమ్మును అప్పుగా తెచ్చి మొత్తంగా రూ. 50 లక్షల వరకు ఆమెకు అప్పగించింది. అయితే, ఎంతకాలమైనా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆదిలక్ష్మి నిందితురాలిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో పథకం ప్రకారం ఆదిలక్ష్మిని తన ఇంటికి పిలిపించిన నిందితురాలు దారుణంగా హత్య చేసింది. అనంతరం నేర ఆధారాన్ని తుడిచిపెట్టేందుకు మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి సమీపంలోని పొలంలో పాతిపెట్టింది.

 Ghatkesar Crime

పోలీసుల దర్యాప్తుతో వెలుగు చూసిన నిజాలు: నిందితురాలి అరెస్ట్

తన భార్య కనిపంచకుండా పోవడంతో ఆందోళన చెందిన ఆదిలక్ష్మి భర్త స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి, కాల్ డేటా మరియు సాంకేతిక ఆధారాల సహాయంతో అనుమానితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితురాలు తాను చేసిన దారుణమైన నేరాన్ని ఒప్పుకోవడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పొలంలో పాతిపెట్టిన ప్లాస్టిక్ డబ్బాలోని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘోర ఘటనతో స్థానిక ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కాకినాడలో దారుణం: వివాహేతర సంబంధం కారణంగా జిమ్ ట్రైనర్ కిరాతక హత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha