AP Weather Updates:రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏపీలో భారీ వర్షాలు జూన్ 22 నుంచి జూన్ 26 వరకు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో పాటు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించింది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Read also: AP Netanna Bharosa: నేతన్నలకు ఏటా రూ.25 వేలు.. కూటమి ప్రభుత్వం చేనేత భరోసా స్కీమ్
Heavy Rains in Andhra Pradesh
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు
కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వానలు కురుస్తాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షం సమయంలో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
AP Weather Updates:విపత్తు నిర్వహణ శాఖ సూచనలు
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు, చెట్ల కింద ఆశ్రయం పొందే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కోస్తా తీరం, యానాం పరిధిలో వేడితో పాటు తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఉక్కపోత కూడా ఉంటుంది. రైతులు, సామాన్య ప్రజలు వాతావరణ శాఖ అప్‌డేట్స్‌ను గమనిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు కోరుతున్నారు.
Epaper: epaper.vaartha.com

