Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో మళ్లీ పెరిగిన ఎండల తీవ్రత

ఏపీలో మళ్లీ పెరిగిన ఎండల తీవ్రత

వార్త 2 months ago

AP Weather Today: గడిచిన కొద్దిరోజులుగా వర్షాలతో కాస్త ఉపశమనం పొందిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది.

ఒకటి రెండు రోజులుగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వేడిగాలి హెచ్చరికలను జారీ చేసింది.

Read Also:TTD Updates: తిరుమలలో భక్తుల రికార్డు: శ్రీవారి సన్నిధిలో పెరిగిన దర్శనాలు

19 మండలాల్లో తీవ్ర వేడిగాలులు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర,ఏజెన్సీ ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం, హిరమండలం. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం, వంగర మండలాలు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం, గరుగుబిల్లి మండలం, గుమ్మలక్ష్మీపురం మండలం,

 Andhra Pradesh Heatwave Alert

జియమ్మవలస మండలం, కొమరాడ మండలం, కురుపాం మండలం, పాలకొండ మండలం, పార్వతీపురం మండలం, సీతంపేట మండలం, వీరఘట్టం మండలాలు. పోలవరం జిల్లా చింతూరు మండలం, కూనవరం మండలం, వరరామచంద్రపురం మండలాలు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం, వేలేరుపాడు మండలాలు. అలాగే 35 మండలాల్లో వేడి గాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.

AP Weather Today: జాగ్రత్తలు తప్పనిసరి

ఎండలు, వేడిగాలులు ప్రభావం ఎక్కువగా ఉందని.. బయటకు వెళ్లేప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తలకి టోపీ లేదా రుమాలు ధరించాలని సూచించారు. తెలుపు రంగు కాటన్ వస్త్రాలు, సన్ గ్లాసెస్ ఉపయోగించాలని.. మంచినీరు ఎక్కువగా తాగాలన్నారు. గుండె జబ్బులు, బిపి, షుగర్ ఉన్నవారు ఎండలో తిరగవద్దని.. సురక్షితంగా ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా, ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కాలిఫోర్నియాలో విజయనగరం యువకుడి మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha