Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో నామినేషన్లకు నేడే ఆఖరి రోజు

ఏపీలో నామినేషన్లకు నేడే ఆఖరి రోజు

వార్త 1 week ago

AP Municipal Elections Nominations : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం నేటితో (18వ తేదీ) ముగియనుంది.

ఈ నెల 16న ప్రారంభమైన ఈ ప్రక్రియలో నేడు ఆఖరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు నామినేషన్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే నామినేషన్లు ప్రారంభమైన తొలి రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో భయాందోళనకర వాతావరణం నెలకొంది. రాజకీయ ఘర్షణలు, పరస్పర దాడులతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.

‘రాయలసీమ’లో హై టెన్షన్.. ఎన్నికల కమిషన్ పటిష్ట భద్రతా చర్యలు!

నామినేషన్ల పర్వంలో పుంగనూరు వేదికగా మొదలైన వివాదాలు, ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పులివెందులలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనతో వాతావరణం మరింత వేడెక్కింది. నామినేషన్ల స్వీకరణకు ఆఖరి రోజు కావడంతో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) అత్యున్నత స్థాయిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. నామినేషన్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

నామినేషన్ సెంటర్ల వద్ద ఉద్రిక్తత.. !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha