Heatwave in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఏప్రిల్ నెలలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.
వేడి గాలులకు తోడు పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయం గురవుతున్నారు.
Heatwave in AP: Sun like a furnace in AP
Heatwave in AP: వరదయ్యపాలెంలో అత్యధిక ఉష్ణోగ్రత
బుధవారం నమోదైన వివరాల ప్రకారం, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో అత్యధికంగా 44.4°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.1°C ఉష్ణోగ్రత రికార్డైంది. మిగిలిన జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటల నుండే ఎండ తీవ్రత మొదలై, సాయంత్రం వరకు వడగాలులు వీస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు.
రానున్న రెండు రోజులు జాగ్రత్త!
రానున్న రెండు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల ప్రభావం అధికంగా ఉండనుంది. రాష్ట్రంలోని 76 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. మరో 134 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

