Petrol Diesel Shortage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత సామాన్య ప్రజలను, ముఖ్యంగా రైతన్నలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లోని ఇంధన కేంద్రాల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. అనేక చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన అసాధారణ పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లాలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉండగా, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.
Read Also :CM Chandrababu Vizag Visit: నేటి నుంచి విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
చమురు కంపెనీలు డీలర్లకు ఇచ్చే కోటాను తగ్గించడం, ప్రైవేట్ సంస్థలైన రిలయన్స్, నయారా సరఫరాను నిలిపివేయడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు మున్ముందు ఇంధనం దొరకదనే ఆందోళనతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తడంతో డిమాండ్ ఏకంగా 34 శాతం పెరిగింది. ఈ ఆకస్మిక ఒత్తిడిని తట్టుకోవడంలో సరఫరా వ్యవస్థ విఫలమైంది.

Petrol Diesel Shortage: ఇంధన కొరతపై అలర్ట్
రాష్ట్రంలో నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ముంబై పర్యటనలో ఉన్నప్పటికీ అక్కడి నుంచే అధికారులతో సమీక్షలు నిర్వహించిన ఆయన, అమరావతికి రాగానే పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. సమస్య మొదలైనప్పుడే ఎందుకు మేల్కోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, క్షేత్రస్థాయిలో మార్పు కనిపించాలని హెచ్చరించారు. ముఖ్యంగా కంపెనీలు అకస్మాత్తుగా క్రెడిట్ పాలసీని మార్చడంపై అసహనం వ్యక్తం చేస్తూ, ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని చమురు సంస్థలను హెచ్చరించారు.
రైతన్నల ప్రయోజనాల దృష్ట్యా కోత మిషన్లకు, వ్యవసాయ యంత్రాలకు డీజిల్ కొరత లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఆక్వా రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే కూపన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన 421 బంకులను తక్షణమే తెరిపించాలని, సోమవారం నాటికి పరిస్థితి చక్కబడాలని డెడ్ లైన్ విధించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పర్యవేక్షిస్తూ, ప్రజలు ఆందోళనతో అదనపు నిల్వలు చేసుకోవద్దని, ఇంధనం అందుబాటులో ఉందని భరోసా ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

