Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో రెండు రోజుల పాటూ వైన్ షాపులు బంద్

ఏపీలో రెండు రోజుల పాటూ వైన్ షాపులు బంద్

వార్త 3 weeks ago

AP Wine Shops Closed: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంది. ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేపట్టారు.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉండటంతో నేడు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి అధికారికంగా ముగింపు పడనుంది.

ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ప్రచారం కొనసాగించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులకు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Read Also : Arnab Cyclone : కుటుంబానికి రూ.3వేల సాయం - ఏపీ సర్కార్ జీవో విడుదల

 Wine shops in AP to remain closed for two days

AP Wine Shops Closed: మద్యం దుకాణాలు బంద్

మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించింది. నేటి సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని వైన్ షాపులు, బార్లు మూసివేయనున్నారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

డ్రోన్లు, సీసీటీవీలతో పోలీసుల నిఘా

నవంబర్ 1న జరగనున్న పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తం 4,372 పోలింగ్ కేంద్రాల పరిధిలో 36,351 మంది పోలీసు సిబ్బందిని భద్రతా విధులకు కేటాయించినట్లు వివరించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు

ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పు చేసింది. ఓటర్లు తమ అభ్యంతరాలు, ఫిర్యాదులను తెలియజేసేందుకు నవంబర్ 2 వరకు గడువును పొడిగించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నవంబర్ 30న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు సవరించిన షెడ్యూల్‌లో వెల్లడించింది.

వామ్మో ..ZPTC అభ్యర్థి.. ఆస్తి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha