Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో స్థానిక ఎన్నికలకు  షెడ్యూల్ రేపే విడుదల

ఏపీలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ రేపే విడుదల

వార్త 1 week ago

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

Telangana High Court: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వ్

జిల్లా పరిషత్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు తేజ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

ముహూర్తం ఖరారు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి స్థాయి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

మొత్తం మూడు దశల్లో

కాగా మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. తొలి విడతలో పట్టణ స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండో విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మూడో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Epaper: epaper.vaartha.com

75 రోజుల విరామం తర్వాత మళ్లీ పాపికొండల బోటింగ్ ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha