Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలోని ఆ జిల్లాల్లో వానలు

ఏపీలోని ఆ జిల్లాల్లో వానలు

వార్త 1 week ago

AP weather updates:రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండం దక్షిణ మధ్యప్రదేశ్ ప్రాంతం మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

ముఖ్యంగా ఉత్తర కోస్తా అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సముద్ర తీర ప్రాంతాల్లో గంటల వ్యవధిలో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయి.

Read also: Nethannala Sevalo Scheme: చేనేత కార్మికులకు అసలైన పండుగ..ఆగస్టు 7న ఖాతాల్లోకి నిధులు!

 Depression moving towards Madhya Pradesh

ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

పార్వతీపురం మన్యం అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. పోలవరం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురుస్తాయి. తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఏలూరు జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయి.

AP weather updates:ప్రజలకు అధికారుల కీలక హెచ్చరికలు

ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. చెట్లు హోర్డింగ్స్ విద్యుత్ స్తంభాల కింద ఎవరూ నిలబడవద్దని స్పష్టం చేశారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Epaper: epaper.vaartha.com

గుంటూరు మార్కెట్లో దూసుకుపోతున్న మిర్చి ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha