Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ-ఒడిశా మధ్య పూర్తిగా నిలిచిపోయిన రోడ్డు, రైలు రవాణా

ఏపీ-ఒడిశా మధ్య పూర్తిగా నిలిచిపోయిన రోడ్డు, రైలు రవాణా

వార్త 3 weeks ago

Arnab Cyclone: 'అర్నాబ్' తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు విలవిలలాడుతున్నాయి. ఒడిశాతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ముఖ్యంగా బాహుదా నది విపరీతంగా ప్రవహిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వీటితో పాటు వంశధార, నాగావళి, మహేంద్రతనయ, సువర్ణముఖి, వేగావతి నదులు తీవ్రంగా ఉప్పొంగడంతో ఆయకట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Read Also : Indian Coast Guard: ఏపీ తీరంలో కోస్ట్ గార్డ్ సాహసోపేత ఆపరేషన్.. 20 మంది ప్రాణాలు కాపాడిన సిబ్బంది!

 Road and rail transport between AP and Odisha has come to a complete halt.

Arnab Cyclone: ప్రమాదకర స్థాయిలో వరద ఉద్ధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

బాహుదా నదిలోకి ఏకంగా 86,458 క్యూసెక్కుల ఇన్-ఫ్లో వచ్చి చేరడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార నది ప్రవాహం 73,324 క్యూసెక్కులకు చేరుకోవడంతో నీటిపారుదల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ భారీ వరదల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, మందస, పాతపట్నం నియోజకవర్గాలు సహా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

నిలిచిపోయిన రైళ్లు, మూతపడిన ఘాట్ రోడ్డు

వరద నీరు రహదారులు, రైల్వే ట్రాక్‌లను ముంచెత్తడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇచ్ఛాపురం లొద్దపుట్టి సమీపంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపైకి వరద నీరు భారీగా చేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇచ్ఛాపురం-జడుపూడి మధ్య రైల్వే ట్రాక్‌లతో పాటు వంతెన దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే గాలికొండ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడటంతో అరకు-విశాఖ ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేశారు. బొర్రా-కారకవలస స్టేషన్ల మధ్య ట్రాక్ దెబ్బతినడంతో కొత్తవలస-కిరండూల్ (KK) ప్యాసింజర్ రైలును నవంబర్ 3 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

అపార పంట నష్టం

ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 728 గ్రామాల్లో సుమారు 21,590 హెక్టార్లలో వరి పంట, 383 హెక్టార్లలో ఉద్యాన పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బారువ తీరప్రాంతంలో సముద్రపు కోత తీవ్రమవ్వడంతో వందలాది కొబ్బరి తోటలు సముద్రంలో కలసిపోయాయి. సోంపేట-బారువ ప్రధాన రహదారిలో దాదాపు 7 కిలోమీటర్ల మేర పొలాల్లో 10 అడుగుల లోతున వరద నీరు నిలిచి ఉండటం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఏపీపై అర్నాబ్ తుపాను పంజా.. రూ.4,600 కోట్ల భారీ నష్టం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha