Dailyhunt
Epstein Files: బాలీవుడ్‌ను వణికిస్తున్న 'ఎప్‌స్టీన్ ఫైల్స్'

Epstein Files: బాలీవుడ్‌ను వణికిస్తున్న 'ఎప్‌స్టీన్ ఫైల్స్'

వార్త 2 months ago

ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు, సినిమా, వ్యాపార రంగాలకు చెందిన పెద్ద పెద్ద వ్యక్తులను షేక్ చేస్తున్న అంశం ఎప్‌స్టీన్ ఫైల్స్. ఈ కేసు గురించి ఎన్నేళ్లుగా చర్చ జరుగుతున్నా, తాజాగా ఒక్కొక్కటిగా రహస్య డాకుమెంట్స్ బయటకు రావడంతో మళ్లీ సంచలనం మొదలైంది.

ఇప్పటివరకు మౌనంగా ఉన్న సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం బాలీవుడ్‌కి కూడా చేరింది. హిందీ సినిమా రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖుల పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌(Epstein Files)లో ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వారే దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, ప్రముఖ రచయిత దీపక్ చోప్రా. దీంతో బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

అసలు ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి?

ఎప్‌స్టీన్ నిర్వహించిన ఓ ఈవెంట్ కోసం అనురాగ్ కశ్యప్ 2017లో బీజింగ్ వెళ్లాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన అనురాగ్ కశ్యప్, 'నాకు చాలా ఆహ్వానాలు వస్తాయి. కానీ నేను ఇప్పటివరకు జీవితంలో ఒక్కసారి కూడా బీజింగ్ వెళ్లలేదు' అంటూ స్పష్టంగా ఖండించారు. ఇక దీపక్ చోప్రా మాట్లాడుతూ, 'నేను ఎప్పుడూ ఎలాంటి నేరపూరిత పనుల్లో పాల్గొనలేదు. ఎప్‌స్టీన్‌తో నా పరిచయం చాలా పరిమితమే. లైంగిక నేరాల విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు' అని చెప్పారు. అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలనే ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటారు. ఎప్‌స్టీన్ ఓ అమెరికన్ బిలియనీర్. అతను మైనర్ బాలికలను లైంగిక అక్రమ రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలింది. 2019లో జైలులో ఉన్న సమయంలో ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు విచారణలో సేకరించిన కోర్టు పత్రాలు, సాక్ష్యాలు, విమాన ప్రయాణ వివరాలు, కాంటాక్ట్ లిస్టులను అమెరికా ప్రభుత్వం ఇప్పుడు విడతల వారీగా బయటకు తీస్తోంది. ఈ పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యక్తుల పేర్లు ఉండటంతో కలకలం రేగుతోంది. అయితే ఫైల్స్‌లో పేరు ఉండటం మాత్రమే నేరానికి రుజువు కాదు. కొందరు ఎప్‌స్టీన్‌కు తెలిసినవారు, కొందరు అతని విమానంలో ప్రయాణించినవారు మాత్రమే.

మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం

Read hindi news: hindi.vaartha.com

Trade Deal: చమురు దిగుమతులకు వెనిజులా వైపుకు భారత్ అడుగులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha