Dailyhunt
ఎస్‌ఆర్‌హెచ్‌తో ఓటమిపై హార్దిక్ పాండ్యా ఎమోషనల్ కామెంట్స్

ఎస్‌ఆర్‌హెచ్‌తో ఓటమిపై హార్దిక్ పాండ్యా ఎమోషనల్ కామెంట్స్

వార్త 1 week ago

MI vs SRH: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఈ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూనే, అభిమానుల తీరుపై ఆయన తన మనసులోని మాటను బయటపెట్టాడు.244 పరుగులు మంచి స్కోర్. అయితే, మా బౌలర్లు ఆ స్కోర్ ను డిఫెండ్ చేస్తారని నమ్మాను. కానీ, మా బౌలింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. మా ఫీల్డింగ్ లో అవకాశాలు చేజారాయి.

Read Also:Hardik Pandya Reaction : సొంత మైదానంలో ఓటమి పాండ్యా ఎందుకు బాధపడ్డాడు

MI vs SRH: అభిమానుల తీరుపై ఆవేదన

ఈ సీజన్లో మేము చాలా క్యాచ్‌లు వదిలేస్తున్నాం. క్యాచ్‌లను పట్టుకున్నప్పుడే అదృష్టం. మూమెంటమ్ మారుతుంది. క్యాచ్ లు వదిలేస్తే జట్టుకు నష్టం జరుగుతుంది. ఈ పరిణామం జట్టు ఓటమికి ప్రధాన కారణంగా మారుతుంది. అయితే, ఈ మ్యాచ్ లో కుర్రాళ్లంతా విజయం కోసం బాగా ప్రయత్నించారు. తమ సర్వస్వాన్ని ఒడ్డారు. కానీ, ఈరోజు మాకు కలిసి రాలేదంటూ హార్డిక్ పేర్కొన్నారు.మా బౌలింగ్ సమస్యలను పరిష్కరించేందుకు మాకు ఆప్షన్స్ కూడా ఎక్కువగా లేవు. ఎలాంటి మార్పులు చేయగలమో పరిశీలిస్తాం. అయితే నా బౌలర్లను నేను తప్పుబట్టను.

 Hardik Pandya Key Comments

ఒక జట్టుగా ముంబై ఇండియన్స్‌కు ఏదైతే గుర్తింపు పొందిందో.. దానికి తగ్గట్టుగా మేం రాణించలేకపోయాం. మేం ఫోకస్ చేయాల్సి విషయాలను సరిచూసుకోవాలి. అయినా పర్వాలేదు. మాకు అంకితభావం కలిగిన ఓనర్స్, గొప్ప సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు. మేం కచ్చితంగా పరిష్కారం కనుగొంటాం. “అభిమానులు మాకు మద్దతు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు మేము ఇవ్వలేదు. వాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్ల పేర్లను పలకడం కాస్త బాధించింది. అభిమానుల ప్రేమను తిరిగి పొందాలంటే మేము మరింత మెరుగ్గా ఆడాలి” అని అన్నాడు.

సన్‌రైజర్స్ సునాయాస విజయం

ముంబై నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సునాయాసంగా ఛేదించింది. హెన్రిచ్ క్లాసెన్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఎస్‌ఆర్‌హెచ్‌ను విజయతీరాలకు చేర్చాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

MI చేసిన ఆ తప్పిదమే ఓటమికి కారణం అయ్యిందా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha