SSC MTS Results 2026: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఫలితాలను విడుదల చేసింది.
తదుపరి దశ అయిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) / ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) పరీక్షల కోసం మొత్తం 8,071 మంది అభ్యర్థులను ఎస్‌ఎస్‌సీ షార్ట్‌లిస్ట్ చేసింది.
Read Also :TG CPGET 2026 Results: రేపు టీజీ సీపీజీసెట్ ఫలితాలు విడుదల!
SSC MTS Results 2026: పరీక్ష ఫలితాల వివరాలు

దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 20 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) ఈ పరీక్షలను నిర్వహించారు.ఈ నియామక పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 8.04 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ను సందర్శించి తమ రోల్ నంబర్ మరియు మెరిట్ జాబితా ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు PET/PST పరీక్షల షెడ్యూల్ మరియు అడ్మిట్ కార్డ్‌ల వివరాలను ఎస్‌ఎస్‌సీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

