Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏషియన్ గేమ్స్‌లో నీరూ ధాండా సత్తా.. భారత్‌కు షూటింగ్‌లో స్వర్ణం

ఏషియన్ గేమ్స్‌లో నీరూ ధాండా సత్తా.. భారత్‌కు షూటింగ్‌లో స్వర్ణం

వార్త 3 weeks ago

Neeru Dhanda: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ నీరూ ధాండా అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. మంగళవారం జరిగిన మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ప్రత్యర్థులను అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు.

ఐచి ప్రిఫెక్చర్ జనరల్ షూటింగ్ గ్యాలరీలో ఫైనల్ పోటీ జరిగింది. పోటీ సమయంలో వర్షం కురుస్తున్నప్పటికీ నీరూ ధాండా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఏకాగ్రతతో షూటింగ్ చేశారు. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనూ స్థిరంగా లక్ష్యాలను ఛేదిస్తూ ప్రత్యర్థులపై ఆధిక్యం సాధించారు. చివరి వరకు అదే జోరును కొనసాగించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.

Read Also :Virat Kohli: 139 పరుగులతో రికార్డుల మోత..కోహ్లీ ప్రదర్శనపై భవ్నా కోహ్లీ స్పందన

మహిళల ట్రాప్ విభాగంలో చారిత్రక విజయం

నీరూ ధాండా సాధించిన ఈ స్వర్ణం భారత షూటింగ్‌కు ప్రత్యేకంగా నిలిచింది. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఈ విజయం కీలక మైలురాయిగా మారింది. ఏషియన్ గేమ్స్ వేదికపై అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరూ.. భారత పతకాల ఖాతాలో మరో స్వర్ణాన్ని చేర్చారు.

Neeru Dhanda: భారత్‌కు మరో స్వర్ణం

ఏషియన్ గేమ్స్‌లో షూటింగ్ భారత బృందానికి కీలక పతకాలను అందించే క్రీడల్లో ఒకటిగా నిలుస్తోంది. నీరూ ధాండా స్వర్ణంతో భారత షూటింగ్ బృందానికి మరింత ఉత్సాహం లభించింది. నీరూ ధాండా విజయంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత షూటర్‌కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

విత్య రామరాజ్‌కు కాంస్యం.. 40 ఏళ్ల పీటీ ఉష రికార్డు బద్దలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha