Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ESI డిస్పెన్సరీలలో మందుల తీవ్ర కొరత - రోగుల అవస్థలు

ESI డిస్పెన్సరీలలో మందుల తీవ్ర కొరత - రోగుల అవస్థలు

వార్త 1 week ago

Shortage of Medicines : కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సేవలు మరియు మందులు అందించాల్సిన ఈఎస్ఐ (ESI) డిస్పెన్సరీలలో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో మందుల కొరత నెలకొంది.

మందుల కొనుగోలుకు ప్రతి మూడు నెలలకొకసారి ఇండెంట్లు సమర్పించాల్సి ఉండగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా మందుల సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. గత అక్టోబర్, నవంబర్‌లలో పంపిన ఇండెంట్లకు సంబంధించి జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన నిల్వలు మే, జూన్ నాటికే ఖాళీ అయ్యాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (CDS) నుంచి కూడా తగినంత స్థాయిలో మందుల సరఫరా అందకపోవడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read Also: Guntakal Bellary Railway Line: గుంతకల్లు-బళ్లారి 3, 4వ రైల్వే లైన్లకు కేంద్రం ఆమోదం:మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు!

 Shortage of Medicines

Shortage of Medicines : ESI డిస్పెన్సరీలలో మందుల తీవ్ర కొరత - రోగుల అవస్థలుఏ ఏ మందుల కొరత ఉందంటే?

రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు అవసరమైన ప్రాథమిక మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు.

  • బిపి, షుగర్ మందులు: హై బ్లడ్ ప్రెజర్ (BP), మధుమేహం (డయాబెటిస్) మందుల నిల్వలు తగ్గడంతో రోగులకు తక్కువ మోతాదులో ఇస్తున్నారు.
  • నరాలు & గుండె సమస్యలు: న్యూరాలజీ మరియు గుండె సంబంధిత వ్యాధులకు అవసరమైన ఔషధాలు దొరకడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • కీళ్ల నొప్పులు & థైరాయిడ్: కాళ్లు, కీళ్ల నొప్పులకు ఉపయోగించే పెయిన్ కిల్లర్లు, థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు నెల రోజులకు ఇవ్వాల్సిన మందులను కేవలం 10 రోజులకు లేదా 4-5 రోజులకు మాత్రమే ఇస్తుండటంతో తరచూ డిస్పెన్సరీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్ఐ పరిధిలో ఉన్న లబ్ధిదారుల సమాచారం మరియు ఆసుపత్రుల నెట్‌వర్క్. మందులు లేకపోవడంతో బయట కొనుగోలు చేసి రీయింబర్స్‌మెంట్ కోసం బిల్లులు పెట్టాలని వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ బిల్లులు మంజూరు కావడానికి సుదీర్ఘ సమయం పడుతుండటంతో చాలామంది పేద ఉద్యోగులు సొంత డబ్బులతోనే మందులు కొనుగోలు చేయలేక నష్టపోతున్నారు.

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన లోకేశ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha