Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ESICలో స్పెషలిస్ట్ పోస్టులు.. ఇంటర్వ్యూతోనే ఎంపిక!

ESICలో స్పెషలిస్ట్ పోస్టులు.. ఇంటర్వ్యూతోనే ఎంపిక!

వార్త 3 weeks ago

ESIC Notification 2026: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్, స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 4 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

Read Also :RBI JE Recruitment 2026: ఆర్బీఐలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు

అర్హతలు, అనుభవం

 ESIC Notification 2026: Specialist posts in ESIC.. Selection through interview only!

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ (MBBS) తో పాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ (MD/MS), డీఎన్​బీ (DNB) లేదా జనరల్ మెడిసిన్​లో డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు 3 నుంచి 5 ఏళ్ల వరకు వృత్తిపరమైన అనుభవం ఉండటం తప్పనిసరి.

ఫీజు వివరాలు

  • జనరల్, ఓబీసీ (OBC) అభ్యర్థులకు: రూ. 300
  • ఎస్సీ (SC), ఎస్టీ (ST), మహిళా అభ్యర్థులకు: ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం

ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మే 5న నిర్వహించే వాక్​ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన వారికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాలతో నిర్ణీత తేదీన ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha