Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయకుంటే ఖర్గే ఇంటి ముందే ధర్నా!

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయకుంటే ఖర్గే ఇంటి ముందే ధర్నా!

వార్త 2 months ago

Harish Rao: హైదరాబాద్ (ధర్నాచౌక్) : కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ డిక్లరే షన్ ను తక్షణమే అమలుచేయాలని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు.

మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ లో లంబాడాల హక్కుల పోరాట సమితి, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబాల్ నాయక్ అధ్యక్షతన చలో హైదరాబాద్ పేరుతో జరిగిన మహాధర్నా కార్యక్రమానికి హరీశ్రరావు ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ హయాంలో లంబాడాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తండాలను పంచాయతీలుగా చేయాలని అనేక పోరాటాలు చేశారని, అయిన ప్పటికీ, కాంగ్రెస్ పార్టీ స్పందించలేదని ఆయన గుర్తు చేశారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత 3,100 తండాలను పంచాయ తీలుగా మార్చి, ఎస్టీలకు రాజకీయవాటా కల్పించిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు.

Read Also :Telangana Free Power Scheme: మీటర్లు పెట్టినా ఉచిత కరెంట్ ఇస్తాం.. ప్రతిపక్షాల గగ్గోలుపై మండిపడ్డ విద్యుత్ శాఖ!

Harish Rao: 50 వేల ఎకరాల దళిత, గిరిజన భూములను గుంజుకున్న ప్రభుత్వంపై ఫైర్

 Harish Rao Speech at Indira Park Dharna

బిఆర్ఎస్ హయాం లో అన్ని సంక్షేమ పథకాలు అమలుచేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత లంబాడాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందని ఆరోపించారు. చేవెళ్ల డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలుచేయకపోగా, 50వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను గుంజుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కు తుందని ధ్వజమెత్తారు. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి ఒక్క పట్టా కూడా ఇవ్వ లేదని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాక్ పోస్టులు భర్తీ చేస్తామని ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదని, కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగా రం పేరుతో ఆడబిడ్డలను మోసం చేశారని ఆరోపిం చారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది ఖర్గేగారే కాబట్టి దానిని అమలుచేయించే బాధ్యత కూడా ఆయనదేనని, లేదంటే నాలుగు రైళ్లల్లో ఢిల్లీకి వచ్చి, ఖర్గే ఇంటిముందే ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎస్సీఎస్టీలను అన్ని విధాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని త్వరలో రాజకీయ సమాధి చేయటం ఖాయమని హెచ్చరించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఎస్టీల అభివృద్ధి కేసీఆర్ పాలనలోనే జరిగిందని, మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ను నమ్మి, ఓట్లు వేస్తే, అన్ని రకాలుగా మోసం చేసిందని ఆరోపించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సుదర్శన్రెడ్డి, ఎస్టీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ యువనేత ముఠా జైసింహ, నగేష్ ముదిరాజ్, బాల్రాజ్యాదవ్, వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణకు మూడేళ్లలో రూ. 5.45 లక్షల కోట్ల ఆదాయం.. కానీ తప్పని అప్పుల వేట!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha