US-Iran Deal : అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్ లో చర్చలు సానుకూలంగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చర్చల్లో భాగంగా ఇరాన్ లో అణు తనిఖీలు, హార్ముజ్ జల సంధి గుండా స్వేచ్ఛా రవాణాపై మాట్లాడుకున్నారు.
అమెరికా కొన్ని ప్రతిపాదనలు చేయగా.. ఇరాన్ కూడా కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇరాన్ (Iran) తమ చమురు ఎగుమతులపై ఆంక్షలు ఎత్తి వేయాలని కోరింది. దీనికి అమెరికా సానుకూలంగా స్పందించింది. అమెరికా ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలను సోమవారం పాక్షికంగా ఎత్తివేసింది. ఇరాన్ పై విధించిన ఆంక్షలను 66 రోజుల పాటు తాత్కాలికంగా ఎత్తివేసింది. ఇందుకు సంబంధించి అమెరికా ట్రెజరీ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ ఆగస్ట్ 21 వరకు ముడి చమురు, పెట్రోకెమికల్, పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది.
Read Also: Chicago Shooting: చికాగోలో కాల్పుల కలకలం.. 7 మంది మృతి
US-Iran Deal
US-Iran Deal : అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన 60 రోజుల ఒప్పందం
ఈ ఆంక్షల ఎత్తివేత జూన్ 17న అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన 60 రోజుల ఒప్పందంలో భాగమని తెలుస్తోంది. ఇరాన్ పై విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో టెహ్రాన్ ఇక నుంచి స్వేచ్ఛాగా చమురును విక్రయించుకోవచ్చు. ఇరాన్ చమురులో మార్కెట్లోకి వస్తే చమురు ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రపంచ దేశాలకు మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఇరాన్ చమురు అమ్మకం, డెలివరీ లేదా అన్‌లోడింగ్‌ను పూర్తి చేయడానికి అవసరమైనప్పుడు దానిని యునైటెడ్ స్టేట్స్‌లోకి దిగుమతి చేసుకోవచ్చని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. 1979లో దేసంలో వచ్చిన ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోలేదు.
Epaper: epaper.vaartha.com

