Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
EU ట్రేడ్ డీల్.. డిసెంబర్లో సైన్ చేయనున్న మోదీ!

EU ట్రేడ్ డీల్.. డిసెంబర్లో సైన్ చేయనున్న మోదీ!

వార్త 3 weeks ago

EU : భారత్‌, యూరోపియన్ యూనియన్‌ (EU) మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) దిశగా కీలక ముందడుగు పడనుంది. ఈ ఒప్పందంపై యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా కీలక వివరాలు వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబరులో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో పర్యటించే అవకాశం ఉందని, ఆ పర్యటన సందర్భంగా భారత్‌-ఈయూ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్‌ 17వ తేదీ కంటే ముందే మోదీ బ్రస్సెల్స్‌ చేరుకోవచ్చని సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌ మధ్య వాణిజ్య సంబంధాలకు కొత్త దిశ లభించనుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక మార్కెట్లలో ఒకటైన యూరప్‌తో భారత్‌ వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇది కీలక అవకాశంగా మారనుంది.

27 దేశాల మార్కెట్‌లో భారత ఎగుమతులకు పెద్ద అవకాశం

భారత్‌-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా యూరోపియన్‌ యూనియన్‌లోని 27 దేశాలతో భారత ఆర్థిక సంబంధాలు మరింత విస్తరించనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం దాదాపు 99 శాతం భారత ఎగుమతులకు యూరప్‌ మార్కెట్‌లో సుంకాల రహిత ప్రవేశం లభించనున్నట్లు సమాచారం. దీనివల్ల భారతీయ ఉత్పత్తులు యూరప్‌లో మరింత పోటీతత్వంతో విక్రయించే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా వస్త్రాలు, ఔషధాలు, రసాయనాలు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, ఇతర తయారీ రంగాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అదే సమయంలో యూరప్‌ నుంచి భారత్‌కు పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ఉత్పత్తి విధానాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అయితే ఒప్పందంపై సంతకాలు, తదుపరి అమలు ప్రక్రియకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే భారత్‌ అంతర్జాతీయ వాణిజ్యంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు.

ఉదయాన్నేఈమెయిల్ ద్వారా 250 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha