Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎయిర్ హోస్టెస్‌తో తమిళనాడు సీఎం విజయ్.. ఫొటో వైరల్!

ఎయిర్ హోస్టెస్‌తో తమిళనాడు సీఎం విజయ్.. ఫొటో వైరల్!

వార్త 2 weeks ago

Joseph Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.

ఒక విమాన ప్రయాణంలో ఎయిర్ హోస్టెస్‌తో ఆయన కలిసి దిగిన ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఆయన చూపిన సాధారణత్వం, నిరాడంబర శైలిని చూసి అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉమా మీనాక్షి అనే ఎయిర్ హోస్టెస్‌కు సీఎం విజయ్‌తో ఫొటో దిగే అరుదైన అవకాశం దక్కింది. ఈ ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. "గౌరవనీయ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గారితో ప్రయాణించడం నా డ్యూటీని మరింత స్పెషల్‌గా మార్చింది" అని ఆమె పేర్కొన్నారు. బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో ఎంతో ప్రశాంతంగా ఉన్న విజయ్ లుక్ చూసి, "ఎంత ఎదిగినా ఒదిగి రకం" అంటూ ఫ్యాన్స్, రాజకీయ విశ్లేషకులు కామెంట్లు పెడుతున్నారు.

Read also: National Spelling Bee: 'స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ' విజేతగా నిలిచిన శ్రేయ్ పారిఖ్!

దిల్లీ పర్యటన వెనుక రాజకీయ ప్రాధాన్యత

సీఎం విజయ్ ఢిల్లీ పర్యటన తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, మౌలిక వసతుల కల్పన, వివిధ సంక్షేమ పథకాలు, మరియు కేంద్ర పరిధిలో పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టుల వేగవంతంపై వారు చర్చించినట్లు సమాచారం.

Joseph Vijay: వెండితెర 'దళపతి' నుంచి 'సీఎం' వరకు..

సినీ రంగంలో అగ్రనటుడిగా వెలిగిన విజయ్, 2024 లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఎదిగే క్రమంలో యువతను ఆకట్టుకుంటూ, అవినీతి రహిత పాలన నినాదంతో ఆయన ప్రజల్లోకి వెళ్లారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించి, ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ వంటి కూటమి పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో ఈ నెల 13న అసెంబ్లీలో విజయవంతంగా విశ్వాస పరీక్షను నెగ్గి, సీఎంగా పూర్తిస్థాయి పగ్గాలు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha