Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎయిర్‌ఫోర్స్ కొత్త చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

ఎయిర్‌ఫోర్స్ కొత్త చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

వార్త 2 weeks ago

Ashutosh Dixit: భారత వైమానిక దళం (IAF) నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, అశుతోష్ దీక్షిత్‌ను 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌ (CAS)గా నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

Read also: Aadhaar updates: ఆధార్ కార్డ్ కొత్త రూల్స్ వచ్చేసాయి

అక్టోబర్ 31న బాధ్యతల స్వీకరణ

ప్రస్తుత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ 2026 అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ఎయిర్ చీఫ్ మార్షల్‌ హోదాలో వైమానిక దళ బాధ్యతలను స్వీకరిస్తారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకానికి ఆమోదం తెలిపారని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

2028 డిసెంబర్ వరకు పదవీ కాలం

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, అశుతోష్ దీక్షిత్ వైమానిక దళాధిపతిగా 2028 డిసెంబర్ 31 వరకు కొనసాగనున్నారు. విశిష్ట సేవలందించిన ఆయనకు పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, వాయు సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్ వంటి అనేక గ్యాలంట్రీ, సేవా పతకాలు లభించాయి. భారత వైమానిక దళ మోడరనైజేషన్, స్వదేశీ రక్షణ సాంకేతికతల బలోపేతంలో ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని రక్షణ రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు.

Read Also Epaper :epaper.vaartha.com

CEC రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గం..సౌరవ్ దాస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha