Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫామ్ కోల్పోయిన స్టార్ కెప్టెన్లు

ఫామ్ కోల్పోయిన స్టార్ కెప్టెన్లు

వార్త 2 months ago

IPL 2026; ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్నప్పటికీ, పలు ప్రధాన జట్ల కెప్టెన్ల ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు జట్టును నడిపించడంలోనూ వీరు ఆశించిన మేర రాణించలేకపోతున్నారు.రుతురాజ్ గైక్వాడ్ (CSK):చెన్నై సారథిగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రుతురాజ్, పరుగుల వేటలో వెనుకబడ్డారు.

Read Also:IPL 2026 : రోహిత్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ !!

హార్దిక్ పాండ్య (MI):ముంబై ఇండియన్స్‌ను గాడిలో పెట్టడంలో హార్దిక్ ఇబ్బంది పడుతున్నారు. ఆల్‌రౌండర్‌గా తన ముద్ర వేయలేకపోతున్నారు.రిషభ్ పంత్ (LSG): లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా పంత్ మెరుపులు ఇంకా మొదలవ్వలేదు.అజింక్య రహానే (KKR): కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఫామ్ జట్టుకు మైనస్‌గా మారింది.

IPL 2026: టాప్‌లో రాజస్థాన్.. కానీ కెప్టెన్ ఫెయిల్!

పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ (RR) టాప్-3లో కొనసాగుతున్నప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ వ్యక్తిగత ఫామ్ మాత్రం ఆందోళనకరంగా ఉంది. జట్టు విజయాల్లో మిగిలిన ఆటగాళ్లు రాణిస్తున్నా, కీలకమైన బ్యాటింగ్ పొజిషన్‌లో పరాగ్ వరుసగా విఫలమవుతుండటం గమనార్హం.

 IPL 2026 Captains Form

దుమ్మురేపుతున్న ఇతర ఆటగాళ్లు

కెప్టెన్లు విఫలమవుతున్న చోట, ఆయా జట్ల కీలక ప్లేయర్లు మాత్రం అద్భుత ఫామ్‌తో జట్టును ఆదుకుంటున్నారు.బెంగళూరు తరపున పాటీదార్ మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నారు.పంజాబ్ కింగ్స్ తరపున శ్రేయస్ నిలకడగా పరుగులు సాధిస్తూ జట్టుకు బలాన్ని ఇస్తున్నారు.సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

IPLలో సరికొత్త రికార్డులు సృష్టించిన కోహ్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha