Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫారం-8తో ఓటును వేరే ప్రాంతానికి మార్చుకోవచ్చు: ఈసీ

ఫారం-8తో ఓటును వేరే ప్రాంతానికి మార్చుకోవచ్చు: ఈసీ

వార్త 3 weeks ago

Vote : సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision-SIR) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక సమాచారం ఇచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్న ఓటర్లు (Vote) తమ ఓటును కొత్త చిరునామాకు బదిలీ చేసుకునేందుకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఎన్నికల సంఘం అధికారిక ఫారం-8లోనే ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నివాసం మారిన సందర్భానికి ప్రత్యేక ఆప్షన్ అందుబాటులో ఉంది.

ఓటర్ల జాబితాలను మరింత ఖచ్చితంగా :

ప్రస్తుతం కొనసాగుతున్న SIRలో ఓటర్ల జాబితాలను మరింత ఖచ్చితంగా, తాజాగా రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నివాసం మారిన కారణంగా పాత ప్రాంతంలోని ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు కొత్త నివాస ప్రాంతానికి తమ ఓటును మార్చుకోవడం ద్వారా భవిష్యత్ ఎన్నికల్లో ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవచ్చు.

కొత్త చిరునామా ఉన్న నియోజకవర్గంలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO)కు ఫారం-8 సమర్పించాల్సి ఉంటుందని ఈసీ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ఫారం-8 కేవలం చిరునామా మార్పుకే పరిమితం కాదు. ఓటర్ల జాబితాలోని వివరాల సవరణ, ఓటర్ ఐడీ (EPIC) కార్డు మార్పిడి, దివ్యాంగ ఓటరుగా గుర్తింపు వంటి సేవలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ఓటర్ సర్వీస్ పోర్టల్‌లో ఫారం-8 సేవ అందుబాటులో ఉంది.

ప్రస్తుతం పోర్టల్‌లో "ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నివాస మార్పు" అనే ఆప్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మహారాష్ట్రలో SIR ప్రక్రియకు ఈసీ ఆగస్టు 17 వరకు గడువు పొడిగించగా, తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 27న ప్రచురించనున్నట్లు తాజా సమాచారం వెల్లడించింది. అందువల్ల ఇటీవల నివాసం మార్చుకున్న ఓటర్లు తమ పేరు, చిరునామా, పోలింగ్ కేంద్రం వివరాలను పరిశీలించి, అవసరమైతే ఫారం-8 ద్వారా మార్పు కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.

దివ్యాంగుల పింఛన్ల కోసం వాట్సాప్ సేవలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha