KTR: ఫార్ములా ఈ-కార్ రేసు వివాదంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అవినీతి నిరోధక శాఖ (ACB) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో తనను మొదటి నిందితుడిగా (A1) చేర్చడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేనందున తన పేరును తొలగించాలంటూ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

నగర ప్రతిష్ట కోసమే రేసు నిర్వహణ - న్యాయవాదుల స్పష్టత
హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టేందుకు, నగర ప్రతిష్టను మరింత పెంచే లక్ష్యంతోనే ఫార్ములా ఈ-రేసును నిర్వహించామని కేటీఆర్ తరఫు లీగల్ టీమ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఈవెంట్ నిర్వహణలో ఎలాంటి ఆర్థిక అక్రమాలు గానీ, నిధుల మళ్లింపు గానీ జరగలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేటీఆర్ వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదని న్యాయవాదులు వాదనలు వినిపించారు.
KTR: ప్రాథమిక ఆధారాలు లేవు - రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆరోపణ
తగిన ప్రాథమిక ఆధారాలు మరియు దర్యాప్తు ఆధారాలు లేకుండానే ఏసీబీ తనను ఏ1 నిందితుడిగా పేర్కొందని కేటీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసును తనపై మోపారని ఆరోపించారు. కోర్టు తగిన పరిశీలన జరిపి, ఈ అక్రమ కేసు నుంచి తక్షణమే తనను విముక్తి (డిశ్చార్జ్) చేయాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
Read Also hindi news: hindi.vaartha.com

