KTR to Appear Before Court : తెలంగాణ రాజకీయాలో తీవ్ర దుమారం రేపిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా (A1) ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం (జూలై 31) నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.
చార్జిషీట్‌ను స్వీకరించిన న్యాయస్థానం జారీ చేసిన సమన్ల మేరకు ఆయన కోర్టు ఎదుట విచారణకు రానున్నారు.
Read Also: Job Notification : రెండేళ్లలోనే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసాం -మంత్రి పొంగులేటి
KTR to Appear Before Court
KTR to Appear Before Court : అసలు ఏమిటీ ఫార్ములా-ఈ రేసు వివాదం?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా ఈ-రేసింగ్ రెండవ ఎడిషన్ నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించారనేది ప్రధాన ఆరోపణ. క్యాబినెట్ మరియు ఆర్థిక శాఖల ముందస్తు అనుమతులు లేకుండానే రూ. 55 కోట్ల ప్రభుత్వ నిధులను యూకేకి చెందిన ‘ఫార్ములా ఈ ఆపరేషన్స్’ (FEO) సంస్థకు మళ్లించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా (A1) చేర్చగా, నాటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ (A2), హెచ్‌ఎమ్‌డీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి (A3), స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు (A4), ఎఫ్‌ఈఓ ప్రతినిధి ఆల్బెర్టో లాంగో (A5) నిందితులుగా ఉన్నారు.కేసుపై స్పందించిన కేటీఆర్, ఈ ఆరోపణలను తీవ్రంగా తోసిపుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కక్షపూరితంగా రాజకీయ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే తాను విచారణకు హాజరవుతున్నానని, ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో గతంలో ఎవరూ అరెస్టు కానందున, నాంపల్లి ఏసీబీ కోర్టులో రేపు జరిగే తొలి ట్రయల్ విచారణలో నిందితులంతా వ్యక్తిగత పూచీకత్తు (Personal Bond) సమర్పించే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

