Elnino Effect:ఎల్ నినో ప్రభావం కారణంగా దేశంలో వాతావరణ పరిస్థితులు భయంకరంగా మారనున్నాయని క్లైమేట్ ట్రెండ్స్ నివేదిక హెచ్చరించింది. వాతావరణ మార్పుల వల్ల 1901 తర్వాత అత్యంత వేడి నెలగా 2026 ఆగస్టు సరికొత్త రికార్డు సృష్టించింది.
1950 తర్వాత భారత్కు ఇది అత్యంత తీవ్రమైన ముప్పుగా పరిణమించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫిబ్రవరి 2027 నాటికే వేసవి ఉష్ణోగ్రతలు మొదలై చలికాలం కాస్తా కాకపుట్టించే ఎండాకాలంగా మారే ప్రమాదం ఉంది. ఈ విపరీతమైన మార్పుల వల్ల రాబోయే రబీ పంటలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడి 13 శాతం వర్షపాత లోటు నమోదైంది. దేశంలో 44 శాతం జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 2024 లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలను 2026-27 సంవత్సరాలు తిరగరాస్తాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ తీవ్రమైన వేడి మానవ ఆరోగ్యం పైనే కాక పర్యావరణం పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోవడం వల్ల రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
AP Weather Update Today: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
Scorching heat to begin as early as February
రైతన్నకు కోలుకోలేని దెబ్బ: లక్షల హెక్టార్లలో ఎండిపోతున్న సాగు!
వర్షపాత లోటు వల్ల తెలంగాణ తో పాటు 5 ప్రధాన రాష్ట్రాల్లో కరవు పరిస్థితులు తలెత్తాయి. అక్టోబర్ 5 నాటికి అందిన గణాంకాల ప్రకారం వరి, చెరకు, పత్తి సాగు విస్తీర్ణం ఊహించని విధంగా తగ్గింది. తెలంగాణలో ఒక్క వరి సాగు విస్తీర్ణమే ఏకంగా 4.26 లక్షల హెక్టార్లు తగ్గిపోవడం కలవరపెడుతోంది. తక్కువ వర్షపాతం వల్ల రైతులు 2025-26 కంటే పప్పుధాన్యాలు, నూనెగింజల వైపు మొగ్గు చూపారు. కేంద్ర వ్యవసాయ శాఖ 2026-27 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 373.93 మిలియన్ టన్నులుగా నిర్ణయించింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2.63 మిలియన్ టన్నులు తక్కువ కావడం గమనార్హం. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు పడిపోయి రాబోయే వేసవి పంటలకు పెద్ద ముప్పు వాటిల్లుతుంది. నూనెగింజలు, పప్పుధాన్యాల సాగు పెరిగినప్పటికీ ప్రధాన ఆహార ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం ఉంది. సరైన సమయంలో వర్షాలు పడకపోవడం వల్ల వ్యవసాయ రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతోంది. సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల మార్కెట్ లో నిత్యావసర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది.
Elnino Effect:అడుగంటిన జలాశయాలు: రాబోయేది కోలుకోలేని నీటి సంక్షోభమా?
దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో సాధారణ వర్షపాతం 716 మిమీ కాగా కేవలం 542 మిమీ మాత్రమే నమోదైంది. ఇది 1901 తర్వాత నమోదైన 4 వ అత్యల్ప వర్షపాతం కావడం గమనార్హం. గతంలో 1918 లో అత్యల్పంగా 435.8 మిమీ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం తెలంగాణలో 18 శాతం, కర్ణాటకలో 30 శాతం, కేరళలో 28 శాతం వర్షపాత లోటు ఉంది. ఆంధ్రప్రదేశ్లో 25 శాతం, తమిళనాడులో 20 శాతం లోటు నమోదైంది. రాయలసీమలో 40 శాతం, కర్ణాటకలోని రామనగర జిల్లాలో ఏకంగా 91 శాతం వర్షపాత లోటు ఏర్పడింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో గత 10 ఏళ్లలో 9 ఏళ్లు ప్రతికూల వర్షపాతమే నమోదైంది. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల జలవిద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షాభావంతో వడగాల్పుల తీవ్రత పెరిగి సాధారణ ప్రజల జీవనాన్ని దెబ్బతీస్తోంది. జల వనరులు వేగంగా ఇంకిపోతుండటంతో రాబోయే రోజుల్లో విద్యుత్, తాగునీటి సంక్షోభం తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.
Epaper: epaper.vaartha.com

