FIH Womens Nations Cup: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న FIH ఉమెన్స్ నేషన్స్ కప్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో టోర్నీని ఘనంగా ప్రారంభించింది.
ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో అమెరికా (USA) జట్టుపై 3-2 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించి బోణీ కొట్టింది. మ్యాచ్ ప్రారంభంలో అమెరికా జట్టు భారత డిఫెన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఫస్ట్ క్వార్టర్‌లోనే USA వరుసగా 2 గోల్స్ సాధించి 2-0తో బలమైన లీడ్ సాధించింది. దీనితో మ్యాచ్ అమెరికా వశమవుతుందా అనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
Read also: Shubman Gill: వన్డేల్లో అత్యంత పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ రికార్డ్
India achieves a resounding victory over the USA in FIH Women’s Hockey.
FIH Womens Nations Cup: సెకండ్ క్వార్టర్‌లో భారత్ 'హ్యాట్రిక్' రీబౌండ్
రెండు గోల్స్ వెనుకబడినప్పటికీ.. భారత మహిళల జట్టు ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సెకండ్ క్వార్టర్‌లో అనూహ్యంగా పుంజుకుంది. భారత్ తరఫున దీపిక రెండు మెరుపు గోల్స్ చేయగా, నవ్‌నీత్ ఒక గోల్ సాధించింది. ఇలా వరుసగా మూడు గోల్స్ (హ్యాట్రిక్) కొట్టి మ్యాచ్‌ను భారత్ తన వైపు తిప్పుకోవడమే కాకుండా.. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుని 3-2తో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత క్రీడాభిమానులకు ఇది వరుసగా రెండో పెద్ద పండుగ అని చెప్పాలి. నిన్న జరిగిన T20 ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లో సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్‌ను టీమ్ ఇండియా చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఆ విజయోత్సాహం మరువక ముందే.. నేడు హాకీలోనూ మహిళల జట్టు అమెరికాపై సంచలన విజయం సాధించి దేశవ్యాప్తంగా జోష్ నింపింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

