Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫీజు రీఫండ్‌పై కీలక ప్రకటన విడుదల చేసిన NTA!

ఫీజు రీఫండ్‌పై కీలక ప్రకటన విడుదల చేసిన NTA!

వార్త 2 weeks ago

NTA NEET 2026 Fee Refund: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసే నీట్ యూజీ (NEET UG-2026) అభ్యర్థులకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) అత్యంత ముఖ్యమైన ప్రకటన చేసింది.

అప్లికేషన్ ఫీజు రీఫండ్ (Fee Refund Process) ప్రక్రియకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు అలర్ట్‌గా ఉండాలని సూచించింది. ఎన్‌టీఏ నిబంధనల ప్రకారం.. అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫామ్‌ను సమర్పించేటప్పుడు అధికారిక పోర్టల్‌లో నమోదు చేసిన బ్యాంక్ అకౌంట్ వివరాల ఆధారంగానే రీఫండ్ సొమ్ము నేరుగా ఆయా అకౌంట్లలోనే జమ కానుంది.

 NEET UG 2026 Fee Refund Process NTA Official Warning Fake Calls Bank Account Details

Read Also :NEET Re-Exam 2026: 21న NEET రీ ఎగ్జామ్.. డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే!

అకౌంట్ వివరాలు సరిచూసుకోండి - ఎన్‌టీఏ సూచన

ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేదా ఆలస్యం లేకుండా రీఫండ్ సొమ్ము నేరుగా మీ ఖాతాలో పడాలంటే అభ్యర్థులు కింద పేర్కొన్న అంశాలను వెరిఫై చేసుకోవాలి. అప్లికేషన్ పోర్టల్‌లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ (IFSC) కోడ్, అకౌంట్ హోల్డర్ పేరు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి లాగిన్ అయ్యి సరిపోల్చుకోవాలి.విద్యార్థులు ఇచ్చిన బ్యాంక్ ఖాతా ప్రస్తుతం రన్నింగ్‌లో (Active) ఉందో లేదో చూసుకోవడం ముఖ్యం. క్లోజ్ అయిన అకౌంట్లు ఇస్తే రీఫండ్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది.

NTA NEET 2026 Fee Refund: నకిలీ కాల్స్, లింకుల పట్ల హెచ్చరిక!

ఈ రీఫండ్ ప్రక్రియను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ఎన్‌టీఏ అభ్యర్థులను గట్టిగా హెచ్చరించింది.

NTA అధికారిక హెచ్చరిక: “మీ నీట్ ఫీజు రీఫండ్ త్వరగా వచ్చేలా చేస్తాం.. లేదా క్యాన్సిల్ అయిన డబ్బులు ఇప్పిస్తాం అంటూ వచ్చే నకిలీ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు (SMS), వాట్సాప్ మెసేజ్‌లు, అనధికారిక ఆన్‌లైన్ లింకుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎన్‌టీఏ ఎప్పుడూ ఫోన్ కాల్స్ ద్వారా బ్యాంక్ ఓటీపీ (OTP) లేదా పిన్ నంబర్లను అడగదు.” అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్ అయిన exams.nta.ac.in/NEET లో వచ్చే అప్‌డేట్స్‌ను మాత్రమే నమ్మాలని అధికారులు స్పష్టం చేశారు.

త్వరలోనే CBSE 10th రెండవ బోర్డు ఫలితాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha