Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిట్‌గా లేకపోయినా ఆడాను.. రియాన్ పరాగ్!

ఫిట్‌గా లేకపోయినా ఆడాను.. రియాన్ పరాగ్!

వార్త 3 weeks ago

IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో తానేం ఆశించి బరిలోకి దిగాడో వివరిస్తూ రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ సంచలన విషయాలను వెల్లడించాడు.

ఆ మ్యాచ్ సమయానికి తాను పూర్తిగా ఫిట్‌నెస్‌తో లేనప్పటికీ, జట్టు ప్రయోజనాల కోసం పెద్ద రిస్క్ తీసుకున్నానని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో సాధించిన అద్భుత విజయం క్రెడిట్ మొత్తం ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కే దక్కుతుందని పరాగ్ కొనియాడాడు.

Read Also : IPL : IPLలో చెత్త రికార్డు మూటకట్టుకున్న రోహిత్

 I played even though I wasn’t fit.. Ryan Parag!

IPL 2026: ప్లే ఆఫ్స్ కోసం కెప్టెన్ సాహసం

మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. తన ఫిట్‌నెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. “నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ ఆడేందుకు నేను పూర్తిగా ఫిట్‌గా లేను. ఈ మ్యాచ్‌తో పాటు ఆ తర్వాత వచ్చే మరో మ్యాచ్‌కు కూడా దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని భావించాను. కానీ, జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. అందుకే జట్టు కోసం ఈ సాహసం చేయాల్సి వచ్చింది” అని పరాగ్ స్పష్టం చేశాడు. అయితే, రాబోయే ఎలిమినేటర్ మ్యాచ్ నాటికి తాను పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించి అందుబాటులోకి వస్తానని అభిమానులకు భరోసా ఇచ్చాడు.

జోఫ్రా ఆర్చర్‌పై ప్రశంసల జల్లు

ఒక కెప్టెన్‌గా మైదానంలో తన వ్యూహాలు ఎలా ఉంటాయో పరాగ్ వివరించాడు. తాను కేవలం పాత రికార్డులు, గణాంకాలను మాత్రమే నమ్ముకుని నిర్ణయాలు తీసుకోనని.. మైదానంలోని పరిస్థితులు, తన అంతరాత్మ అంచనాల ఆధారంగానే అడుగులు వేస్తానని చెప్పాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఔట్ చేయగల సామర్థ్యం ఆర్చర్‌కు ఉందనే నమ్మకంతోనే కీలక సమయంలో అతనికి బంతిని అప్పగించానని, తను అనుకున్నట్లే ఆర్చర్ వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడని పరాగ్ ఆనందం వ్యక్తం చేశాడు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా, బ్యాటింగ్‌లోనూ ఆర్చర్‌ను ప్రమోట్ చేస్తూ ముందుకు పంపడం సరైన నిర్ణయమని రుజువైందన్నాడు. ఆర్చర్ కేవలం 15 బంతుల్లోనే 32 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించాడని కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రశంసించాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

IPLలో చెత్త రికార్డు మూటకట్టుకున్న రోహిత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha