Flydubai : దుబాయ్‌కి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ 'ఫ్లైదుబాయ్' (Flydubai) విమానంలో చోటుచేసుకున్న భయాందోళనకర ఘటనకు సంబంధించి అంతర్జాతీయ మీడియా సంస్థ 'సీబీఎస్ న్యూస్' (CBS News) ఒక సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.
విమాన ప్రయాణంలో గాల్లో ఉన్న సమయంలో కో-పైలట్ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహంతో కెప్టెన్‌పై దాడి చేసి, విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకుని హైజాక్ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం అందింది. ఈ ఊహించని పరిణామంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. అమెరికాలో జరిగిన 9/11 దాడుల తరహాలోనే ఈ విమానం ద్వారా కూడా తమ దేశ ప్రధాన నగరాలు లేదా ఆస్తులపై దాడి జరిగే అవకాశముందని భావించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం, ఎలాంటి ప్రాణనష్టానికైనా తెగించి ఆ విమానాన్ని గాల్లోనే పేల్చేసేందుకు (Shot Down) కూడా సిద్ధపడిందని ఆ కథనం స్పష్టం చేసింది.
ఎయిర్‌స్పేస్ దిగ్బంధం, ఫైటర్ జెట్ల మోహరింపు.. తృప్తిలో తప్పిన పెను ప్రమాదం!
అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ తమ సైనిక బలగాలను వెనువెంటనే రంగంలోకి దించింది. తమ గగనతలాన్ని (Airspace) తక్షణమే మూసివేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యుద్ధ విమానాలను (Fighter Jets) గాల్లోకి పంపించింది. గతంలోనే 9/11 తరహా ఉగ్రదాడులు ఎదురైతే ఎలా స్పందించాలనే దానిపై కఠిన శిక్షణ పొందిన ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ జెట్లు సదరు విమానాన్ని చుట్టుముట్టేందుకు సిద్ధమయ్యాయి. అయితే, చివరి క్షణంలో విమానం దిశ మారి సౌదీ అరేబియా వైపు ప్రయాణించడంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ విమానాన్ని పేల్చివేసే తీవ్ర నిర్ణయాన్ని విరమించుకుని, తమ ఫైటర్ జెట్లను వెనక్కి రప్పించింది. సమయస్ఫూర్తితో విమాన మార్గం మారడంతో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు దక్కినట్లయిందని, లేని పక్షంలో ఈ ఘటన అత్యంత తీవ్ర విషాదంగా మారేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Jeffrey Archer Passes Away: బ్రిటన్ మాజీ ఎంపీ, ప్రముఖ రచయిత జెఫ్రీ ఆర్చర్ ఇకలేరు

